Shabaash Mithu: ‘వచ్చేయండి.. మిథాలీ రాజ్‌ కథేంటో చూద్దాం’.. శభాష్‌ మిథు ట్రైలర్‌ వచ్చేది అప్పుడే..

Shabaash Mithu: నిజ జీవితాల కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు ప్రేక్షకులకు ఆదరణ బాగా పెరుగుతోంది. రాజకీయ, సినీ నాయకుల నుంచి మొదలు క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌లకు ప్రేక్షకులకు..

Shabaash Mithu: 'వచ్చేయండి.. మిథాలీ రాజ్‌ కథేంటో చూద్దాం'.. శభాష్‌ మిథు ట్రైలర్‌ వచ్చేది అప్పుడే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2022 | 1:53 PM

Shabaash Mithu: నిజ జీవితాల కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు ప్రేక్షకులకు ఆదరణ బాగా పెరుగుతోంది. రాజకీయ, సినీ నాయకుల నుంచి మొదలు క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్‌లకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మేకర్లు సైతం ఇలాంటి సినిమాలు తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోకే వస్తుంది ‘శభాష్‌ మిథు’ సినిమా. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేడీ క్రికెటర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న తొలి చిత్రంగా పేరు సంపాదించుకుందీ సినిమా.

శ్రీజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిథాలీ పాత్రలో తాప్పీ నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వయాకామ్‌ 18 స్డూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. జూన్‌ 20న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ తెలిపిన తాప్సీ.. ‘ఈ కెప్టెన్‌ కేవలం ఒక ప్లేయర్‌ మాత్రమే కాదు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వచ్చేయండి మిథాలీ రాజ్‌ కథేంటో చూద్దాం’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..