Pakka Commercial: పక్కా కమర్షియల్ ట్రైలర్ వచ్చేసింది.. మారుతి మార్క్ కామెడీ, గోపీచంద్ స్టైల్‌లో యాక్షన్
మ్యాచో మ్యాన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం పక్క కమర్షియల్. గత కొంత కాలంగా సరైన హిట్స్ లేని గోపీచంద్ ఈ సినిమా పైన బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.

మ్యాచో మ్యాన్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం పక్క కమర్షియల్(Pakka Commercial). గత కొంత కాలంగా సరైన హిట్స్ లేని గోపీచంద్ ఈ సినిమా పైన బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ప్రతి రోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ఇది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మాతగా ఈ పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇటు ప్రేక్షకుల వరకు అంతటా అనూహ్యమైన స్పందన లభించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ చాలా ఎంటర్టైనర్ గా కట్ చేశారు. ఈ ట్రైలర్ లో మారుతి తనదైన శైలిలో కామెడీ ఫన్ ఎలిమెంట్స్ ని జోడించి గోపిచంద్ మార్క్ యాక్షన్ ను కూడా హైలెట్ చేశారు. అలాగే రాశిఖన్నా గ్లామర్ కూడా ఆకట్టుకుంది. రావురమేష్ పాత్ర.. సత్యరాజ్ పాత్రల్ని బాగా ఎలివేట్ చేశారు. గోపీచంద్- రాశి ఖన్నాల కామెడీ టైమింగ్ .. రావు రమేష్ విలనిజం. ఈ సినిమాలో సత్యరాజ్ గోపీచంద్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య ఛాలెంజ్ సీన్స్ ట్రైలర్ లో చూపించడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




