AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Spider Man No Way Home: సూపర్ హీరో చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ సూపర్‌ మ్యాన్‌ సిరీస్‌ సినిమాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతారు.

Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
Spider Man No Way Home
Basha Shek
|

Updated on: Jun 12, 2022 | 3:34 PM

Share

Spider Man No Way Home: సూపర్ హీరో చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ సూపర్‌ మ్యాన్‌ సిరీస్‌ సినిమాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతారు. దీనిని మరోసారి నిరూపించింది స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌ (Spider Man No Way Home). గ‌తేడాది డిసెంబ‌ర్ 16న యూఎస్ కంటే ఒక రోజుమందే ఇండియాలో ఈ చిత్రం విడుద‌లైంది. మొద‌టి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచనాల‌కు త‌గ్గట్టే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటివరకు స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్‌లో వ‌చ్చిన క‌థ‌లు, అందులోని క్యారెక్టర్లను కనెక్ట్‌ చేస్తూ దర్శకుడు జాన్‌వాట్‌ ఈ విజువల్‌ వండర్‌ను సృష్టించాడు. హాలీవుడ్ స్టార్‌ హీరో టామ్‌ హాలండ్‌ (Tom Holland) తన అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. సినిమా చివ‌ర్లో ప్రతి క్యారెక్టర్‌కు ఒక‌ జ‌స్టిఫికేష‌న్ ఇచ్చాడు.

వెండితెరపై కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇండియాలో సుమారు రూ. 200 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల డాల‌ర్ల గ్రాస్‌ క‌లెక్షన్లను సాధించి హాలీవుడ్ చిత్రాల‌లో 5వ హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. సిల్వర్ స్క్రీన్ పై ఇంతలా సందడి చేసిన స్పైడ‌ర్ మ్యాన్ ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాలో టామ్‌ హాలండ్‌తో పాటు జెండీయా, బెనెడిక్ట్‌ కంబర్‌బ‍్యాచ్‌, విలియమ్‌ డాఫే, జేమీ ఫాక్స్‌, ఆల్ఫ్రెడ్‌ మొలీనా కీలక పాత్రలు పోషించారు. ఆండ్య్రూ గ్యారీఫీల్డ్​, టోబే మాగ్వైర్​లు కూడా స్పైడర్​మ్యాన్​పాత్రల్లో అలరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Actress Sukrithi: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కేరింత నటి.. నెట్టింట్లో వైరలవుతోన్న నిశ్చితార్థం ఫొటోలు..

Vidyadhan Scholarship 2022: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పాస్‌ విద్యార్ధులకు ‘విద్యాదాన్‌’ స్కాలర్‌షిప్‌లు..రూ.60,000ల వరకు..

Rana Daggubati: ఆ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించిన రానా.. ఒకేరోజు రెండుసార్లు చూశానంటూ..