AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani : మరో టాలెంటెడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. ఆ దర్శకుడు ఎవరంటే

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్స్ యథా ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ కొట్టిన ఈయంగ్ హీరో ఇప్పుడు రీసెంట్ అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Nani : మరో టాలెంటెడ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. ఆ దర్శకుడు ఎవరంటే
Nani
Rajeev Rayala
|

Updated on: Jun 12, 2022 | 3:30 PM

Share

నేచురల్ స్టార్ నాని( Nani )ప్రస్తుతం వరుస హిట్స్ కొట్టి ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ కొట్టిన ఈయంగ్ హీరో ఇప్పుడు రీసెంట్ అంటే సుందరానికి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తెలుగులోకి అడుగు పెట్టింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాని నేచురల్ నటన నజ్రియా క్యూట్ యాక్టింగ్ తో కట్టిపడేశారు. ఇక ఈ సినిమా తర్వాత నాని దసరా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ మహా తో నాని సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. అలాగే సత్యదేవ్ తో ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య సినిమా చేశాడు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల అయింది. రీసెంట్ గా  వెంకటేష్ మహా నానికి ఒక భిన్నమైన కథను చెప్పినట్లుగా తెలుస్తోంది. కథ నచ్చడంతో నాని ఓకే చేశాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌