Mahesh Babu: జక్కన్న సినిమాలో మహేష్ సరసన ఆ బాలీవుడ్ అందాల భామ..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Mahesh Babu: జక్కన్న సినిమాలో మహేష్ సరసన ఆ బాలీవుడ్ అందాల భామ..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2022 | 7:14 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు మహేష్. దాదాపు 11 ఏళ్లతర్వాత ఈ కాంబోలో సినిమా రానుంది దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఉండనుంది.

మహేష్ , జక్కన్న కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఆఫ్రికర్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపించింది. ఇక ఈ సినిమా పనులు కూడా మొదలు పెటేసాడట జక్కన్న. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ సరసన అందాల రాశి ఐశ్వర్య రాయ్ నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు ఆమెతో జక్కన్న సంప్రదింపులు జరుపుతున్నాడని అంటున్నారు. బాహుబలి , ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాలీవుడ్ లో జక్కన్నకు మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఐష్ నో చెప్పే ఛాన్స్ లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి