Dasara : స్పీడ్ పెంచిన నేచురల్ స్టార్ .. అనుకున్న దానికంటే ముందుగానే దసరా

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోరుమీదున్నాడు నేచురల్ స్టార్ నాని. మొన్నామధ్య శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ కొట్టిన నాని. రీసెంట్ గా అంటే సుందరానికి మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Dasara : స్పీడ్ పెంచిన నేచురల్ స్టార్ .. అనుకున్న దానికంటే ముందుగానే దసరా
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 12, 2022 | 7:33 PM

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోరుమీదున్నాడు నేచురల్ స్టార్ నాని(Natural star Nani). మొన్నామధ్య శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ కొట్టిన నాని. రీసెంట్ గా అంటే సుందరానికి మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తెలుగులోకి స్ట్రయిట్ ఎంట్రీ ఇచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత  నాని దసరా సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాను ‘దసరా’కి రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకోవడంతో అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. గత ఏడాది క్రిస్మస్ మనదే అంటూ ‘శ్యామ్ సింగ రాయ్’తో నాని హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిస్మస్ టార్గెట్ గా వస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు నాని ఫ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి