AR Rahman: గ్రాండ్‌గా ఏఆర్‌ రెహమాన్‌ తనయ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. సందడి చేసిన సెలబ్రిటీలు.. వైరలవుతోన్న ఫొటోలు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ గ్రహీత ఏ ఆర్‌ రెహమాన్‌ (AR Rahman) పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ (Khatija Rahman) వివాహం ఈ ఏడాది మే7న ఘనంగా జరిగింది. సౌండ్‌ ఇంజినీర్‌ అయిన రియాస్‌ దీన్‌ షేక్‌ మొహమ్మద్‌ను ఖతీజా వివాహమాడింది.

AR Rahman: గ్రాండ్‌గా ఏఆర్‌ రెహమాన్‌ తనయ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. సందడి చేసిన సెలబ్రిటీలు.. వైరలవుతోన్న ఫొటోలు..
Ar Rahman
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2022 | 5:43 PM

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ గ్రహీత ఏ ఆర్‌ రెహమాన్‌ (AR Rahman) పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్‌ (Khatija Rahman) వివాహం ఈ ఏడాది మే7న ఘనంగా జరిగింది. సౌండ్‌ ఇంజినీర్‌ అయిన రియాస్‌ దీన్‌ షేక్‌ మొహమ్మద్‌ను ఖతీజా వివాహమాడింది. చెన్నై వేదికగా జరిగిన ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా చెన్నైలోనే వెడ్డింగ్‌ రిసెప్షనను గ్రాండ్‌గా ఏర్పాటుచేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (MK Stalin) వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వాదించారు. అలాగే కొంత మంది నటులతో పాటు సింగర్స్, మ్యూజిషియన్స్, ఫిల్మ్ వేకర్స్ ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. మనీషా కోయిరాలా, మణిరత్నం, శేఖర్ కపూర్, సోనూ నిగమ్, ఉదిత్ నారాయణ్, జావేద్ అలీ, అబ్దు రజాక్, శివమణి, జతిన్ పండిట్‌ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ పాప్ సింగర్ హానీసింగ్ కూడా ఈ వేడుకలో సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానుతో పంచుకున్నాడు. ‘కొత్త జంటకు శుభాకాంక్షలు. ఏఆర్. రెహమాన్ సార్ కుటుంబానికి, అభిమానులకు అభినందనలు’ అంటూ తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు.

వీరితో పాటు రెహమాన్‌ మిత్రులు, సన్నిహితులతో పాటు పలువురు సింగర్స్, మ్యూజిషియన్స్, ఫిల్మ్ మేకర్స్‌ ఈ రిసెప్షన్‌ పార్టీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది ఆర్టిస్టులు స్టేజి మీద పాటలు పాడారు. డ్యాన్స్‌లు చేశారు. ఈ వేడుకలో పర్పుల్ లెహెంగాను ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది ఖతీజా. ఇక రియాస్‌ దీన్‌ నలుపు రంగు సూట్‌లో దర్శనమిచ్చాడు. కాగా తండ్రి బాటలోనే నడుస్తోన్న ఖతీజా రెహమాన్‌ సింగర్‌గా రాణిస్తోంది. కృతిసనన్‌ ప్రధాన పాత్రలో రూపొందిన మిమీ చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాట‌ను ఖ‌తీజానే పాడింది.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Cooper Noriega: టిక్‌టాక్‌ సెన్సేషన్‌ అనుమానాస్పద మృతి.. షాపింగ్‌మాల్‌లో దొరికిన శవం.. ఆ వీడియో షేర్‌ చేసిన కొద్ది సేపటికే..

ఒత్తిడిలో ఉన్నప్పుడు కోతులు ఏం చేస్తాయో తెలుసా?

Nikhat Zareen: బాక్సింగ్‌లో మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకున్న నిఖత్‌ జరీన్‌..