777 Charlie : ఇదేం పని గురూ..! తనపై తీసిన సినిమా చూసేందుకు వచ్చిన కుక్క.. ఎంట్రీ లేదన్న థియేటర్ యాజమాన్యం..

పెట్స్ మీద అరుదుగా సినిమాలు వస్తుంటాయి.. జంతువుల మీద తీసే సినిమాల్లో ఎమోషనల్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒకప్పుడు గుర్రాలు, ఏనుగుల మీద కూడా సినిమాలు తీశారు. పెట్స్ మీద కూడా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ 777 చార్లీ సినిమా మాత్రం గుండెలను బరువెక్కేలా చేస్తోంది.

777 Charlie : ఇదేం పని గురూ..! తనపై తీసిన సినిమా చూసేందుకు వచ్చిన కుక్క.. ఎంట్రీ లేదన్న థియేటర్ యాజమాన్యం..
777 Charlie Movie
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 5:39 PM

777 Charlie సినిమా అంటే విపరీతమైన అభిమనాం చూపిస్తున్నారు జనాలు. కుక్క, మనిషి మధ్య సంబంధాన్ని కలిగి ఉన్న ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందుతోంది. రక్షిత్ శెట్టి (Rakshith Shetty) హీరోగా, నిర్మాతగా పెద్ద హిట్టయ్యాడు. దర్శకుడు కిరణ్‌ రాజ్‌ కృషిని అందరూ మెచ్చుకుంటున్నారు. జంతువులు ముఖ్యంగా కుక్కల పట్ల ప్రజలు శ్రద్ధ వహించేలా చేయడంలో సినిమా సక్సెస్‌ అయింది. 777 చార్లీలోని సందేశం అందరికీ చేరింది. ఈ సినిమా చూసేందుకు కొంతమంది తమ కుక్కతో వస్తున్నారు. అయితే, సినిమా థియేటర్‌లోకి వెళ్లేందుకు అనుమతి లభించడం లేదని ఆందోళన చెందుతున్నారు. దావరణగెరెలో ఓ అభిమాని ఎదుర్కొన్న పరిస్థితి ఇలా ఉంది..

అవును, దావణగెరెలోని ప్రేక్షకులు తమ పెంపుడు కుక్క డయానాతో కలిసి గీతాంజలి సినిమాకు వచ్చారు. కుక్కతో కుక్క కతళ సినిమా చూడాలన్నది వారి కోరిక. వారు కూడా తమ కుక్క 777 Charlieని చూడాలని తహతహలాడుతున్నారు. కానీ, కుక్క థియేటర్‌లోకి ప్రవేశించడానికి నిరాకరించారు థియేటర్‌ యజమాని, సిబ్బంది. దాంతో కలత చెందిన వారు తమ ఆవేదనను వెల్లిబుచ్చారు. 3టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నాం. మేము మా డయానా(కుక్క)తో కూర్చుని సినిమా చూస్తాము. ఈ కుక్క ఎవరినీ ఇబ్బంది పెట్టదు అని చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. ఎంతగా బ్రతిమిలాడిన వారు అంగీకరించలేదని వాపోయారు.

ఇదిలా ఉంటే, 777 Charlie సినిమా ప్రమోషన్‌ సందర్భంగా షార్లీ కుక్కను కూడా బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లోకి అనుమతించలేదని మూవీ హీరో రక్షిత్‌ శెట్టి తెలిపారు. ఈ సినిమా చూసి చాలా మంది మూడ్‌లు మారిపోతాయని హీరో రక్షిత్‌శెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమా కథగురించి చర్చించుకున్నట్లయితే, హీరో ధర్మ (రక్షిత్ శెట్టి) కుటుంబాన్ని కోల్పోయి ఒంటరి జీవితానికి అలవాటు పడతాడు. పక్క వారితో కలిసిపోయే గుణం కాదు. కనీసం నవ్వడం కూడా తెలియనట్టుగా బతుకుతాడు. తినడం, పడుకోడం, తాగడం, ఉద్యోగం ఇదే అతని దినచర్యగా ఉంటుంది. అలాంటి ధర్మ జీవితంలోకి ఓ కుక్క (చార్లీ) వస్తుంది. చార్లీ రాకతో ధర్మ జీవితం ఎలా మారింది? ధర్మకు చార్లీ ఎందుకు దగ్గరైంది? చార్లీ కోసం ధర్మ ఎలాంటి సాహసాలు చేశాడు? చివరకు చార్లీ ఏమైంది? అన్నదే కథ.

ఈ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టీజర్, ట్రైలర్ వచ్చినప్పటి నుంచే.. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, ప్రయోగం చేయబోతోన్నారని అందరికీ అర్థమైంది. ఫుల్లీ ఎమోషనల్‌ మూవీ 777 Charlie (777 చార్లీ) శుక్రవారం నాడు రిలీజైంది.