ఐఏఎస్‌ అధికారిణి ఆవుకు అనారోగ్యం, రంగంలోకి ఏడుగురు సభ్యుల వైద్య బృందం, కలెక్టర్‌ ఆదేశాలు..

చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఒక్కోసారి రోగులు ఆస్పత్రిలో నేలపైనే పడుకోవాల్సి వస్తుంది. అత్యవసర రోగులకు కొన్నిసార్లు గంటల తరబడి కూడా చికిత్స ప్రారంభం కావడం లేదు. అయితే, ఒక ఆవు కోసం ఏకంగా..

ఐఏఎస్‌ అధికారిణి ఆవుకు అనారోగ్యం, రంగంలోకి ఏడుగురు సభ్యుల వైద్య బృందం, కలెక్టర్‌ ఆదేశాలు..
Sick Cow
Follow us

|

Updated on: Jun 12, 2022 | 6:44 PM

ఆస్పత్రులు, వైద్యుల సంఖ్య పెరిగినప్పటికీ, మన దేశంలో ఆరోగ్య సేవలపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఒక్కోసారి రోగులు ఆస్పత్రిలో నేలపైనే పడుకోవాల్సి వస్తుంది. అత్యవసర రోగులకు కొన్నిసార్లు గంటల తరబడి కూడా చికిత్స ప్రారంభం కావడం లేదు. అయితే, ఒక ఆవు కోసం ఏకంగా ఏడుగురు వైద్యుల బృందం ఏర్పాటు చేసినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా..? తాజాగా అలాంటి ఘటనే యోగి ఆదిత్యనాథ్‌ రాజ్యంలో చోటు చేసుకుంది. అయితే, జిల్లా మేజిస్ట్రేట్‌ స్వయంగా ఆవుల కోసం ఈ ఏర్పాటు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్‌ అధికారిణికి చెందిన ఆవు అనారోగ్యం బారిన పడింది. దాంతో దాని చికిత్స కోసం ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులకు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం బయటపడటంతో వివాదస్పదమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా మేజిస్ట్రేట్ అనుప్రియ దూబేకు చెందిన ఆవు అనారోగ్యం పాలైంది. దీంతో ఆ ఆవుకు చికిత్స కోసం ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులకు విధులు కేటాయించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆవును పరిశీలించి నివేదిక అందజేయాలని పశు వైద్యులను చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జారీ చేసిన లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Cow Sick

Cow Sick

మరోవైపు 2017లో యూపీలోని రాంపూర్‌లో జరిగిన ఒక సంఘటనను ఇది గుర్తు చేసింది. ఎస్పీ నేత అజామ్‌ ఖాన్‌కు చెందిన గేదెలు మాయమయ్యాయి. దీంతో వాటిని వెతికేందుకు పోలీస్‌ బలగాలను రంగంలోకి దించారు. చివరకు పోలీస్‌ డాగ్స్‌ సహాయంతో ఆ గేదెల ఆచూకీని గుర్తించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఐఏఎస్‌ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఒక ఐఏఎస్‌ అధికారి తన పెంపుడు కుక్కతో వాక్‌ చేసేందుకు క్రీడాకారులను ముందుగానే స్టేడియం నుంచి ఖాళీ చేయించడం వివాదస్పదమైంది. దీంతో ఆ ఐఏఎస్‌ అధికారిని లఢక్‌కు ఆయన భార్యను అరుణాచల్‌ ప్రదేశ్‌కు బదిలీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..