Revenge: భర్త ఆత్మ వెంటాడింది..! ఏనుగు రూపంలో తొక్కి చంపినా, కోపం చల్లారలేదు.. చివరకు అలా

గజరాజుల ఆగ్రహం ఎలా ఉంటుందో తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల ద్వారా చూస్తూనే ఉంటాం..వాటికి ఆగ్రహం వస్తే ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా వాటి కాళ్లతో తొక్కి విధ్వంసం చేసేస్తాయి. ఆవేశంతో ఉన్న ఓ ఏనుగు ఓ మహిళను తొక్కి చంపేసింది. అంతటితో ఆగలేదు,

Revenge: భర్త ఆత్మ వెంటాడింది..! ఏనుగు రూపంలో తొక్కి చంపినా, కోపం చల్లారలేదు.. చివరకు అలా
Elephant Got Angry
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 7:55 PM

గజరాజుల ఆగ్రహం ఎలా ఉంటుందో తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల ద్వారా చూస్తూనే ఉంటాం..వాటికి ఆగ్రహం వస్తే ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా వాటి కాళ్లతో తొక్కి విధ్వంసం చేసేస్తాయి. ఆవేశంతో ఉన్న ఓ ఏనుగు ఓ మహిళను తొక్కి చంపేసింది. ఆ ఏనుగు అంతటితో ఆగలేదు, ఆ మహిళ అంత్యక్రియలకు కూడా వచ్చింది. మరోమారు మృతదేహంపై తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఇదంతా చూసిన స్థానికులు, బంధువులు ఒకింత షాక్‌ అయ్యారు. అంతలోనే మరో విచిత్ర ప్రచారం మొదలుపెట్టారు. చనిపోయిన ఆమె భర్తే ఈ ఘటనకు కారణమంటూ వింత ప్రచారం మొదలుపెట్టారు. అదేంటంటే..

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మయూర్‌భంజ్ జిల్లాలో అడవి ఏనుగు దాడిలో 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మహిళ మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఏనుగు మళ్లీ వచ్చి ఆమె మృతదేహాన్ని చితిపై నుంచి తీసుకెళ్లింది. మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌పల్‌ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది మయ ముర్మూ(70). మంచి నీటి కోసం ఆమె సమీప పంపు మోటర్‌ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో దాల్మా వైల్డ్‌లైప్‌ శాంక్చురీ నుంచి పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గమనించిన స్థానికులు, హుటాహుటిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు.

వృద్ధురాలి మృతదేహన్ని గ్రామానికి తరలించిన బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బంధువులు, గ్రామస్తులంతా కలిసి ఆమెను స్మశనవాటికకు తరలించారు. ముర్మూ మృతదేహాన్ని చితి మీద ఉంచారు. అయితే అదే సమయంలో మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమైంది అదే ఏనుగు. దీంతో జనాలంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. ఈసారి చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి కిందపడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసింది. అప్పటికిక తన పగ తీరిపోయిందన్నట్టుగా సైలెంట్‌గా అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్నవాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. చివరకు ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే..మయ ముర్మూ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆ పెద్దాయనకు భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ఒకటి ఊరిలో వినిపిస్తుందట. ఆ భర్తే ఆత్మగా మారి.. ఆ ఏనుగు ద్వారా ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని, అందుకే గ్రామస్తుల జోలికి రాకుండా ఆ ఏనుగు వెళ్లిపోయిందంటూ ఊరు ఊరంతా ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగు ప్రకోపానికి కారణం ఏదైనా ఉండొచ్చని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి