Video viral: మనుషులకే కాదు, మాకూ ఫీలింగ్స్‌ ఉంటాయ్‌.. మూగప్రేమకు నెటిజన్లు ఫిదా! వీడియో చూస్తే మీరుకూడా..!!

ఫీలింగ్స్‌ అనేవి అందరికీ ఒకటే, ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయని అంటారు. మనుషులే కాదు జంతువులు కూడా ప్రేమానురాగాలు ఉంటాయి. అందుకు సాక్షంగా నిలిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ

Video viral:  మనుషులకే కాదు, మాకూ ఫీలింగ్స్‌ ఉంటాయ్‌.. మూగప్రేమకు నెటిజన్లు ఫిదా! వీడియో చూస్తే మీరుకూడా..!!
Reunion
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 8:19 PM

ఇంటర్నెట్‌లో ఎక్కువ శాతం జంతువుల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. జంతువుల ఫన్నీ వీడియోలను చూసేందుకు నెటిజన్లు చాలా ఇష్టపడుతుంటారు. కొన్ని జంతువులు సహజంగా చేసే ఫన్నీ ముచ్చట్లు ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటి వీడియోలు చాలా వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. మరికొన్ని వీడియోలు నెటిజన్ల మనసును హత్తుకుంటాయి.

ఫీలింగ్స్‌ అనేవి అందరికీ ఒకటే, ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయని అంటారు. మనుషులే కాదు జంతువులు కూడా ప్రేమానురాగాలు ఉంటాయి. అందుకు సాక్షంగా నిలిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. మనం వీడియోలో చూడగలిగినట్లుగా, జంతు నిపుణుడిగా కనిపించే ఒక వ్యక్తి, ఒక కొండెంగ పిల్లను ఒక కంటైనర్‌లో తీసుకువచ్చి పొలంలో వదిలిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఆ బుజ్జి కొండెంగ కంటైనర్ నుండి బయటకు వచ్చిన వెంటనే, సమీపంలోని తల్లి, తమ జాతిజంతువుల వద్దకు పరిగెత్తుతుంది. అక్కడ అప్పటికే అనేక కొండెంగలు ఉన్నాయి. ఆ బుజ్జిది అక్కడికి వెళ్లడానికి గోడ ఎక్కుతుండగా, తల్లి కొండెంగ తన చేతితో బిడ్డను లాగుతుంది. కొన్ని సెకన్లు భావోద్వేగంతో నిండి ఉంది. తల్లి బిడ్డను పైగి లాగి తన గుండెలకు హత్తుకుంటుంది. తన కుటుంబ సభ్యులంతా కూడా ఆ బుల్లి కొండెంగను దగ్గరకు తీసుకుంటాయి. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయబడిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్ల నుండి విపరీతమైన ప్రేమను పొందుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 7 వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి.70 వేల మంది ఈ వీడియోను లైక్ చేసారు. ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి