AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ రాలేదు..! విషయం చెప్పిన భరణి

బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు భరణి, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భరణి ఎక్కువగా విలన్ పాత్రలే చేశాడు. సినిమాల్లోనే కాదు సీరియల్స్ లోనూ నటించి మెప్పిస్తున్నాడు భరణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.

ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ రాలేదు..! విషయం చెప్పిన భరణి
Bharani Shankar
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2026 | 8:28 PM

Share

బిగ్ బాస్ పుణ్యమా అని నటుడు క్రేజ్ మరింత పెరిగింది. ఎన్నో సినిమాల్లో నటించిన భరణి.. విలన్ గా మెప్పించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్నాడు భరణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  భరణి శంకర్ బిగ్ బాస్  రియాలిటీ షోల ప్రభావం గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు, బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్ల ప్రవర్తనలో మార్పులుంటాయని అన్నాడు భరణి. రియాలిటీ షో అనేది కేవలం ఒక ప్లాట్‌ఫాం మాత్రమేనని, ఇది ఒక నటుడికి నేరుగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టదని అన్నాడు భరణి. రియాలిటీ షోలలో కంటెస్టెంట్లు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తారని,  నవదీప్ వంటి నటులు ఇప్పటికే తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని బిగ్ బాస్‌కు వచ్చి, ఆ తర్వాత కూడా తమ కెరీర్‌ను కొనసాగించారని అన్నాడు భరణి. కొత్తగా వచ్చే నటీనటులు రియాలిటీ షోల నుండి బయటకు వచ్చిన తర్వాత అవకాశాల కోసం సొంతంగా కృషి చేయాల్సి ఉంటుందని అన్నాడు భరణి.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ, భరణి శంకర్ టీవీలో అనేక సీరియల్ ప్రాజెక్ట్‌లు చేశానని, 2020 నుండి సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారని తెలిపాడు. బాహుబలి 1 లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ చేసిన తర్వాత తనకు కొంత మైలేజ్ వచ్చిందని, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రంలో మంచి నెగటివ్ పాత్ర (మిథున్ చక్రవర్తి పాత్రను ఎగ్జిక్యూట్ చేసేది) చేసిన తర్వాత తనకు మంచి ఆఫర్లు వస్తాయని ఆశించానని తెలిపాడు. అయితే, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదని, అయినప్పటికీ తాను నిరాశపడలేదని, తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నానని అన్నాడు.

చిన్న, పెద్ద క్యారెక్టర్లు, ఒకరోజు వేషాలు, పదిరోజుల వేషాలు చేస్తూనే ఉన్నానని చెప్పారు. గోపాల గోపాల చిత్రంలో తన విభిన్నమైన లుక్ గురించి మాట్లాడుతూ, చాలామంది అది తనే అని గుర్తించలేకపోయారని భరణి శంకర్ అన్నాడు. వరుణ్ తేజ్, నాగబాబు తన నటనను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నాగబాబు తనను చూసి “నార్త్ ఇండియన్ అనుకున్నాను, మన భరణి ఆ?” అని అన్నారని, తన లుక్, క్యారెక్టర్ బాగున్నాయని ప్రశంసించారని తెలిపాడు. ఒక హిట్ సినిమాలో ఒక నిమిషం కనిపించినా, అది ప్రేక్షకులపై ప్రభావం చూపాలని, ఆడియన్స్‌కు నచ్చాలని  చెప్పుకొచ్చాడు భరణి. భరత్ అనే నేను చిత్రంలో ఒక జర్నలిస్ట్ రోల్‌లో ఒక ప్రశ్న అడగడమే గొప్ప ఇంపాక్ట్ ఇచ్చిందని తెలిపాడు. నటుడిగా తన ప్రయాణంలో కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని భరణి శంకర్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
చంద్రగ్రహణం రోజున రెండు తలల దూడకు జన్మనిచ్చిన ఆవు.. ఇదిగో వీడియో
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
మూడేళ్లుగా వాగులో బండరాయిగా వదిలేశారు.. తీరా చూస్తే షాక్!
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
చీపురును ఈ మూలన పెడితే డబ్బే డబ్బు.. లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఇలా
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? సూపర్ టిప్స్..