AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. ఒంట్లో రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం..

బార్లీలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. వాస్తవానికి బార్లీ ఒక సురక్షితమైన ధాన్యం.. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. దీనిలోని పీచు పదార్థం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కిడ్నీ, గాల్ బ్లాడర్ రాళ్లను నివారించడంలో, క్యాన్సర్ కణాలను తొలగించడంలో కూడా బార్లీ ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. ఒంట్లో రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం..
Health Benefits Of Barley Water
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2026 | 8:52 PM

Share

బార్లీలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. బార్లీ నీటిని తప్పనిసరిగా తాగాలని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు. బార్లీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, రాగి, యాంటీఆక్సిడెంట్లకు బార్లీ ప్రసిద్ధి.. బార్లీ నీరు.. ఎన్నో అనారోగ్య సమస్యలకు సహజమైన పానీయం.. దీనిద్వారా.. రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు.. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.. గుండె ఆరోగ్యానికి, హైడ్రేట్ గా ఇది అత్యంత ఉత్తమమైన ఆహారమని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

అందుకే.. బార్లీ, ఒక సురక్షితమైన, బహుముఖ ధాన్యం.. ఇది అనేక ఆరోగ్య సందేహాలకు పరిష్కారం చూపుతుందని పేర్కొంటున్నారు. ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, పలు కీలకమైన వైద్యపరమైన ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది.

బార్లీ వాటర్ ప్రయోజనాలు..

బరువు తగ్గడం – డిటాక్సిఫికేషన్: బార్లీ ప్రాథమిక ప్రయోజనాలలో ఒకటి దాని డిటాక్సిఫికేషన్ సామర్థ్యం. బార్లీలోని సమృద్ధిగా ఉండే కరిగే, కరగని పీచు పదార్థం (ఫైబర్) శరీరంలోని వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియ బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.

మెరుగైన జీర్ణక్రియ – గట్ ఆరోగ్యం: బార్లీలోని అధిక ఫైబర్ కంటెంట్ గట్ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. బార్లీ ఉప్మా, బార్లీ జావ, బార్లీ కిచిడీ లేదా బార్లీ సంకటి రూపాల్లో దీనిని తీసుకోవచ్చు. అయితే, వడియాలు వంటి ప్రాసెస్ చేయబడిన బార్లీ స్నాక్‌లను నివారించి, బార్లీ ధాన్యాలను మొలకెత్తించి (స్ప్రౌటెనింగ్) తీసుకోవడం మరింత ఆరోగ్యకరమైన ఎంపిక.

మధుమేహం నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి బార్లీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిలోని అధిక పీచు పదార్థం, బీటా-గ్లూకాన్‌లు రక్తంలో ఇన్సులిన్ స్పైక్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మధుమేహ రోగుల ఆహారంలో బార్లీని ఒక ముఖ్యమైన ధాన్యంగా చేర్చుకోవచ్చు. దీనిలోని ఫైటోకెమికల్స్ కూడా షుగర్ నియంత్రణకు తోడ్పడతాయి.

కిడ్నీ – గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారణ: బార్లీ కిడ్నీ రాళ్లను నివారించడంలో, వాటిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పరిశోధనల ప్రకారం, బార్లీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ రాళ్ల పరిమాణం తగ్గి, చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి, మూత్రం ద్వారా సులభంగా బయటకు వెళ్లేలా చేస్తుందని పేర్కొంటున్నారు. ఇదే విధంగా, బార్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడటాన్ని నిరోధించడంలో కూడా ఉపయోగపడుతుంది. వేగంగా బరువు తగ్గే (రాపిడ్ వెయిట్ లాస్) సందర్భాలలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక ఫైబర్ కలిగిన బార్లీ ఆహారం గాల్ బ్లాడర్‌ను ఆరోగ్యంగా ఉంచుతూ, ఈ రాళ్ల ఏర్పడటాన్ని నివారిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రోటీన్ ఆధారిత వేగవంతమైన బరువు తగ్గింపు డైట్‌తో పోలిస్తే, బార్లీతో కూడిన అధిక ఫైబర్ డైట్ గాల్ బ్లాడర్ ఆరోగ్యానికి మెరుగైనదని తేలింది.

యాంటీ-క్యాన్సరోజెనిక్ లక్షణాలు: బార్లీకి యాంటీ-క్యాన్సరోజెనిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ కణాలపై జరిగిన పరిశోధనలలో, బార్లీలోని డిటాక్సిఫికేషన్ స్వభావం శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను గుర్తించి, వాటిని బయటకు పంపడంలో సహాయపడుతుందని నిరూపించబడింది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే దాని సహజ సామర్థ్యం క్యాన్సర్ కణాల తొలగింపుకు కూడా వర్తిస్తుంది.

బార్లీని ఇలా తయారు చేసుకోండి..

బార్లీ గింజలు సులువుగా, తక్కువ రేటుకే దొరకుతాయి. కేజీ ధర రిటైల్ లో 150 వరకు ఉంటుంది. బార్లీని మీ రోజువారీ ఆహారంలో వివిధ రూపాల్లో చేర్చుకోవడం ద్వారా ఈ బహుముఖ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది సురక్షితమైన ధాన్యం కాబట్టి, చాలా మందికి ఇది అనుకూలంగా ఉంటుందంటున్నారు. ఇంకా బార్లీని ఉడకబెట్టి నీటిని తాగవచ్చు.. లేదా పౌడర్ చేసుకుని.. నీటిలో కలుపుకొని తాగవచ్చు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. బార్లీని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us