AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం

MI vs PBKS IPL 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎటువంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా కొనసాగుతుండగా, ముంబై మాత్రం వరుస ఓటములతో సతమతమవుతోంది.

MI vs PBKS IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్.. మ్యాచుకు రోహిత్ శర్మ దూరం
Mi Vs Pbks Ipl 2026 (1)
Rakesh
|

Updated on: Apr 16, 2026 | 7:13 PM

Share

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య 24వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ముంబై అభిమానులకు షాకిస్తూ ఈ కీలక మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తుది జట్టులో లేడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎటువంటి సందేహం లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా కొనసాగుతుండగా, ముంబై మాత్రం వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌కు ముందే అనుమానించినట్లుగా, రోహిత్ శర్మ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఆడుతున్నప్పుడు అతడు గాయపడ్డాడు. రోహిత్‌తో పాటు మిచెల్ సాంట్నర్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు.

వాంఖడే స్టేడియం అంటేనే బ్యాటర్ల స్వర్గధామం. ఇక్కడ ఈ సీజన్‌లో ఇప్పటికే నాలుగు సార్లు 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. కేకేఆర్, ఆర్‌సీబీ, ముంబై జట్లు ఇక్కడ భారీ స్కోర్లు సాధించాయి. చిన్న బౌండరీలు ఉండటం వల్ల సిక్సర్ల వర్షం కురుస్తుంది. టాస్ గెలిచిన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉండటం వల్ల చేజింగ్‌కు మొగ్గు చూపుతుంది.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచి అప్రహతంగా దూసుకుపోతోంది (ఒకటి వర్షం వల్ల రద్దయింది). మరోవైపు ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న తరుణంలో, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటు.

తుది జట్లు :

ముంబై ఇండియన్స్ (MI):

క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెఫ్రైన్ రూథర్‌ఫోర్డ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, ట్రెంట్ బౌల్ట్.

పంజాబ్ కింగ్స్ (PBKS):

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కౌపర్ కానోలీ, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైశాఖ్ విజయ్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..