AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పొరేట్ ప్రపంచానికి క్రీడా వేదిక… TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026కి రంగం సిద్ధం

కార్పొరేట్ ప్రపంచానికి క్రీడా వేదికగా నిలిచిన TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. మరింత భారీగా సీజన్-2తో ముందుకు వస్తోంది. గచ్చిబౌలిలో మే 15–17 వరకు జరిగే ఈ పోటీల్లో అగ్ర సంస్థల జట్లు, ఆటగాళ్లు పోటీపడనున్నారు. పుల్లెల గోపిచంద్ అనుబంధంతో ఈ టోర్నమెంట్‌కు మరింత ప్రతిష్ట చేరనుంది.

కార్పొరేట్ ప్రపంచానికి క్రీడా వేదిక… TV9 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026కి రంగం సిద్ధం
TV9 Corporate Badminton Championship
Ram Naramaneni
|

Updated on: Apr 16, 2026 | 7:07 PM

Share

కార్పొరేట్ ఉద్యోగులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ.. పోటీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే వేదికగా నిలిచిన TV9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మరోసారి రంగంలోకి దిగుతోంది. తొలి సీజన్ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ మెగా ఈవెంట్.. ఇప్పుడు మరింత భారీ స్థాయిలో సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తొలి సీజన్ ఘన విజయం

గత ఏడాది నిర్వహించిన మొదటి సీజన్‌కు అగ్రశ్రేణి సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, అమెజాన్, ఐకియా, మేక్‌మైట్రిప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ABB, డాక్టర్ రెడ్డీస్, నోవార్టిస్, శ్రోడింగర్, డెల్, కాప్‌జెమినీ, గ్రీన్‌కో వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో 300 మందికి పైగా క్రీడాకారులు, 64కిపైగా కార్పొరేట్ జట్లు పాల్గొని.. 1000కిపైగా మ్యాచ్‌లు నిర్వహించడం విశేషం.

మరింత భారీగా సీజన్-2

ఈ విజయోత్సాహంతో.. TV9 నెట్‌వర్క్ సీజన్-2ను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి 17 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ పోటీలు జరగనున్నాయి.

గోపిచంద్ అనుబంధం ప్రత్యేకం

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్ ఈ ఛాంపియన్‌షిప్‌తో అనుబంధం కొనసాగించడం ప్రత్యేకత. 2001లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచిన గోపిచంద్.. భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మార్గదర్శకత్వంతో ఈ టోర్నమెంట్ మరింత నాణ్యత, పారదర్శకతతో నిర్వహించబడనుంది.

పోటీ విభాగాలు

టీమ్ ఛాంపియన్‌షిప్ (పురుషుల విభాగం): మెన్ సింగిల్స్ (2 మ్యాచ్‌లు), మెన్ డబుల్స్

ఒక జట్టులో కనీసం 3 నుంచి గరిష్టంగా 5 మంది ఆటగాళ్లు ఉండాలి. అందరూ ఒకే సంస్థకు చెందినవారే కావాలి.

ఓపెన్ కేటగిరీ (వ్యక్తిగతంగా): మెన్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ వీటిలో వేర్వేరు సంస్థలకు చెందినవారు కూడా పాల్గొనవచ్చు.

భారీ బహుమతులు

విజేతలకు మొత్తం రూ.5 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలు, ప్రత్యేక గుర్తింపులు అందించనున్నారు.

ఈవెంట్ వివరాలు

తేదీలు: మే 15–17, 2026

వేదిక: పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, గచ్చిబౌలి, హైదరాబాద్

నమోదు ఎలా?

పోటీల్లో పాల్గొనాలనుకునే వారు www.tv9x.com/corporatecup లో నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం మెయిల్ ఐడీ corporatecup@tv9.com, ఫోన్ నంబర్‌ 70320 03222 సంప్రదించవ్చు

ఈవెంట్ పార్టనర్షిప్.. భాగస్వామ్యాల కోసం

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ: ఎంఎన్ చార్య – 9948299698

కర్ణాటక: శ్రీధర్ – 9008026103

కోల్‌కతా: మోహువా రాయ్ – 8334872780

ఢిల్లీ: వికాస్ – 9810266385

గుజరాత్: మౌలిక్ షా – 9909941607

మహారాష్ట్ర: భూషణ్ – 9820139372

ఈ TV9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2026.. ఉద్యోగ జీవితానికి ఉత్సాహాన్ని జోడించే వేదికగా నిలవనుంది.

View this post on Instagram

A post shared by TV9 Telugu (@tv9telugu)

Follow Us