AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా? ఇది తెలుసుకోండి..

నేటి కాలంలో రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా.. ఫోన్‌ చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా మనలో చాలా మంది ఫోన్‌ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు ఇది మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం మీద దృష్టి పెట్టాలని, భోజనం ఆస్వాదించాలని..

భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా? ఇది తెలుసుకోండి..
Using Phone While Eating
Srilakshmi C
|

Updated on: Mar 03, 2026 | 8:29 PM

Share

నేటి కాలంలో మొబైల్‌ ఫోన్‌ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీంతో రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా.. ఫోన్‌ చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా మనలో చాలా మంది ఫోన్‌ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు ఇది మంచి అలవాటు కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం మీద దృష్టి పెట్టాలని, భోజనం ఆస్వాదించాలని, నెమ్మదిగా తినాలని చెబుతున్నారు. తద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో మన పెద్దలు ఇలాగే తినేవారని చెబుతున్నారు. కానీ నేడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ భోజనం చేస్తూ టీవీ, మొబైల్ ఫోన్లు చూస్తుంటారు. అందుకే మొబైల్ ఫోన్లు చూస్తూ తినే అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు స్క్రోల్ చేస్తూ మీరు కూడా తింటున్నారా? ఈ అలవాటు మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూస్తే ఏమవుతుంది?

ఊబకాయం పెరుగుదల

తినేటప్పుడు టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్ చూడటం వల్ల మన దృష్టి ఆహారం నుంచి మళ్లుతుంది. దీంతో మనకే తెలియకుండా ఎక్కువగా తినడం జరుగుతుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోలేం. ఇది తరువాత ఊబకాయ సమస్యకు దారితీస్తుంది.

జీర్ణ సమస్యలు

టీవీ చూస్తూ లేదా మొబైల్ ఫోన్ వాడుతూ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఆహారం సరిగ్గా నమలకపోతే జీర్ణక్రియ సరిగ్గా జరగదు. మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్ ప్రమాదం

భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే టీవీ చూస్తూ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా ప్రాసెస్ అవ్వకుండా నిరోధిస్తుంది. బరువు పెరుగుతుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

తినేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి

  • భోజనం చేసేటప్పుడు మీరు టీవీ లేదా ఫోన్ ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి.
  • తినేటప్పుడు ఆహారం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మాట్లాడకూడుద. ఫోన్ చూడకూడదు.
  • ఆహారాన్ని నెమ్మదిగా నమలాలి. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
  • భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగవద్దు. ఇది జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కొంప ముంచుతున్న వేడి నీటి స్నానం.. జుట్టు, చర్మం వేగంగా డ్యామేజ్
కొంప ముంచుతున్న వేడి నీటి స్నానం.. జుట్టు, చర్మం వేగంగా డ్యామేజ్
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
సెలబ్రిటీల విడాకుల వెనుక అసలు రహస్యం ఇదేనా?..
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..?
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
ఉదయాన్నే బార్లీ వాటర్ తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా?
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
కాబోయే పెళ్లికూతురు ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌ కలకలం..!
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు..హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..
చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే..