US Patriot Front: అమెరికాలో భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. 31 మంది అరెస్ట్..
US Patriot Front: అమెరికాలో LGBTQ ప్రైడ్ ఈవెంట్‌పై పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేట్రియాట్ ఫ్రంట్‌కు చెందిన 31 మంది శ్వేతజాతీయులను అరెస్టు చేశారు.

US Patriot Front: అమెరికాలో LGBTQ ప్రైడ్ ఈవెంట్‌పై పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేట్రియాట్ ఫ్రంట్‌కు చెందిన 31 మంది శ్వేతజాతీయులను అరెస్టు చేశారు. అమెరికా ఇడాహో స్టేట్‌లో ఈ వారాంతంలో LGBTQ ప్రైడ్ ఈవెంట్‌కు భారీ ఎత్తున కొనసాగింది. ఈ వేడుకలు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ఇదే సమయంలో అక్కడ భారీ ఎత్తున అలజడి రేపేందుకు కుట్ర జరిగింది. కోయూర్‌డీలో ప్రైడ్ ఈవెంట్‌కు సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం వెళ్లింది. ఖాకీ ప్యాంట్‌లు, నీలి చొక్కాలు, తెల్లని ముసుగులు ధరించిన వీరి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు దాదాపు 31 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా శ్వేత జాతీయవాదులకు చెందిన పేట్రియాట్ ఫ్రంట్‌కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. టెక్సాస్, కొలరాడో, వర్జీనియా ప్రాంతాల నుంచి వచ్చిన వీరు LGBTQ ప్రైడ్ ఈవెంట్‌లో అల్లర్లకు కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వీరందరినీ అరెస్టు చేసి విచారణ జరిపారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. తమకు ముందుగా అందిన సమాచారంతో కుట్ర భగ్నమైందని పోలీసులు తెలిపారు.




మరోవైపు పార్క్‌కు సమీపంలో కొందరు వ్యక్తులు తుపాకులతో కనిపించారని నిర్వాహకులు తెలిపారు. LGBTQ ఈవెంట్‌కు హాజరయ్యేవారిని భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పేట్రియాట్ ఫ్రంట్ 2017లో వర్జీనియాలోని ఛార్లెట్ విల్లేలో ఏర్పడింది. ఇది శ్వేత జాతీయవాదాన్ని ప్రచారం చేసే అతివాద గ్రూప్. ఇలాంటి గ్రూప్స్ అమెరికాలో చాలా ఉన్నాయి.
