Pet dog : ఓరి దేవుడో.. వంటనేర్చిన కుక్క, ఇళ్లంతా తగలబెట్టింది.. వీడియో చూస్తే షాకే

మీ పెంపుడు కుక్కను ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లటం సురక్షితమని మీరు ఎప్పుడైనా అనుకుంటే, ఈ సంగతి తెలిస్తే మాత్రం తప్పక అలర్ట్‌ అవుతారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.. ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.

Pet dog : ఓరి దేవుడో.. వంటనేర్చిన కుక్క, ఇళ్లంతా తగలబెట్టింది.. వీడియో చూస్తే షాకే
Pet Dog
Jyothi Gadda

|

Jun 14, 2022 | 11:24 AM

జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించి చాలా రకాల ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, Pet Animals ఎన్ని ఉన్నా కానీ, కుక్కది మాత్రం ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. కుక్కలు విశ్వాసానికి మారుపేరు అని అందరూ అంటారు. తమ యజమాని పట్ల కుక్క చూపించే విశ్వాసం ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే, ఓ పెంపుడు కుక్క చేసిన పని దాని యజమానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటికి విశ్వాసంగా కాపలా కాసే కుక్క దానికున్న అలవాటుతో యజమానికి ధననష్టం తీసుకొచ్చింది. అది చేసిన పనితో అతని ఇళ్లు ఖాలీ బూడిదైంది.కుక్క చేసిన పనితో దిక్కుతోచని స్థితిలో యజమాని లబోదిబోమన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

మీ పెంపుడు కుక్కను ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లటం సురక్షితమని మీరు ఎప్పుడైనా అనుకుంటే, ఈ సంగతి తెలిస్తే మాత్రం తప్పక అలర్ట్‌ అవుతారు. అలాంటి వారి కోసమే ఈ వార్త..యూఎస్‌లోని మిస్సౌరీలో ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఆ ఇంటి యజమాని తమ పెంపుడు కుక్కను ఇంట్లో ఒంటరిగా విడిచివెళ్లినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆ కుక్క ఇళ్లంతా తిరుగుతూ వంటగదిలోకి వెళ్లి గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసింది. దాంతో పెద్ద మంటలు వ్యాపించాయి. ఆ పరిసరాల్లోని సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది. మంటలు గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న కాన్సాస్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌, సదరన్ ప్లాట్ ఫైర్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో మంటలను అదుపుచేశారు. ఈ ఘటన పార్క్‌విల్లేలోని రిస్ లేక్ పరిసరాల్లో చోటుచేసుకుంది. మంటలు చెలరేగినప్పుడు లోపల ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందన్నారు ఫైర్‌ సిబ్బంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పెంపుడు కుక్కలతో జాగ్రత్తల ఉండాలని, ఇంలాటి ఘటనలు దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని ఎవరూ లేని సమయంలో పెంపుడు కుక్కలను ఒంటరిగా వదిలివెళ్లటం సరికాదంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu