Video viral: వయ్యారాల పిల్లి క్యాట్‌వాక్‌ చేస్తుంటే చూడాల్సిందే మరీ..! నెటిజన్లు ఫిదా

కొన్ని జంతువుల విన్యాసాలు లేదంటే ఫీట్లు చేయడం మీరు తప్పక చూసే ఉంటారు. వీధుల్లో జరిగే జాతరల్లోనూ కొన్ని జంతువులు విన్యాసాలు చేస్తూ కనిపిస్తుంటాయి.. అయితే, ఈ జంతువులు ఫీట్ చేయడానికి శిక్షణ పొందుతాయి. కానీ, ఇక్కడో పిల్లి ఎలాంటి ట్రైయినింగ్‌ లేకుండానే సర్కాస్‌ ఫీట్లు చేస్తోంది.

Video viral: వయ్యారాల పిల్లి క్యాట్‌వాక్‌ చేస్తుంటే చూడాల్సిందే మరీ..! నెటిజన్లు ఫిదా
Cat Walk
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 14, 2022 | 9:30 AM

పాయింటెడ్ రైలింగ్‌పై ఈ పిల్లి కదులుతున్న బ్యాలెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు, వీడియో వైరల్ అవుతుంది మీరు మీ లైఫ్‌లో ఏదో ఒక సమయంలో కొన్ని జంతువుల విన్యాసాలు లేదంటే ఫీట్లు చేయడం మీరు తప్పక చూసే ఉంటారు. వీధుల్లో జరిగే జాతరల్లోనూ కొన్ని జంతువులు విన్యాసాలు చేస్తూ కనిపిస్తుంటాయి.. అయితే, ఈ జంతువులు ఫీట్ చేయడానికి శిక్షణ పొందుతాయి. కానీ, ఇక్కడో పిల్లి ఎలాంటి ట్రైయినింగ్‌ లేకుండానే సర్కాస్‌ ఫీట్లు చేస్తోంది. ఆ పిల్లి వీడియో ఒక ప్రస్తుతం సోషల్ మీడిలో బాగా వైరల్‌ అవుతోంది. విశేషమేమిటంటే ఇది శిక్షణ పొందిన పిల్లి కాదు. అయినప్పటికీ, క్యాట్‌ క్యూట్‌ ఫీట్స్‌ చేస్తుంటే..చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ పిల్లిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వీడియోలో పిల్లి బ్యాలెన్స్ చూసి అందరూ షాక్‌ అవుతున్నారు.

మనం ఇప్పటిదాకా అందమైన మగువలు రాంప్‌మీద క్యాట్‌ వ్యాక్‌ చేయడం చూశాం..అమ్మాయిలు అలా వయ్యారాలు పోతు స్టైల్‌గా క్యాట్‌ వాక్‌ చేస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్లు చాలవు కదా.. మరి అలాంటిది నిజంగానే క్యాటే, క్యాట్‌వాక్‌ చేస్తే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి..అదేంటి పిల్లి క్యాట్‌ వాక్‌ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? ప్రస్తుతం ఓ పిల్లి క్యాట్‌వాక్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. ఒక ఇనుప గ్రిల్‌పై ఒక పిల్లి ఎంతో చక్కగా నడవడం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఒక ఇనుప గ్రిల్‌పై ఒక పిల్లి ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా ఏ మాత్రం బెదురు లేకుండా ఎంతో చక్కగా నడవడం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో కనిపించే ఒక పిల్లి ఇంటి బయట ఉన్న ఒక ఇనుప గ్రిల్‌ మీదకువచ్చి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆగ్రిల్‌ మీద తెగ వయ్యారాలు పోతూ నడుస్తుంది. అలా నడుస్తూ నడుస్తూ మధ్యలో ఓసారి ఆగి ఓహో.. నా నడక బాగుందా అన్నట్టుగా ఓ ఎక్స్ ప్రెషన్‌ ఇచ్చింది..ఆ తర్వాత మళ్లీ తన నడకను కొనసాగిస్తుంది. రైలింగ్‌పై పిల్లి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజనం ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. తమ జీవితంలోనూ ఇలాంటి విశ్వాసం ఎంతైన అవసరమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

View this post on Instagram

A post shared by RVCJ Media (@rvcjinsta)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. వార్త రాసే సమయానికి 3.67 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి