AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అట్లుంటది మరి మనతో దోస్తీ అంటే.. మెట్లెక్కేందుకు స్నేహితునికి సాయం.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పప్పీ వీడియో..

Viral Video: శునకాలను విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తారు. అందుకే చాలామంది పెంపెడు జంతువులుగా కుక్కలనే పెంచుకుంటారు. ఇంట్లో సొంతమనుషుల్లా వాటిని చూసుకుంటారు. ఇక పప్పీల్లాంటి చిన్న కుక్క పిల్లలను

Viral Video: అట్లుంటది మరి మనతో దోస్తీ అంటే.. మెట్లెక్కేందుకు స్నేహితునికి సాయం.. నెటిజన్లను ఫిదా చేస్తోన్న పప్పీ వీడియో..
Basha Shek
|

Updated on: Jun 14, 2022 | 8:27 AM

Share

Viral Video: శునకాలను విశ్వాసానికి మారుపేరుగా పిలుస్తారు. అందుకే చాలామంది పెంపెడు జంతువులుగా కుక్కలనే పెంచుకుంటారు. ఇంట్లో సొంతమనుషుల్లా వాటిని చూసుకుంటారు. ఇక పప్పీల్లాంటి చిన్న కుక్క పిల్లలను చూసి చాలామంది మురిసిపోతుంటారు. ముఖ్యంగా పిల్లలు వాటిని ఎంతో మురిపెంగా చూసుకంటారు. ఇక సోషల్‌ మీడియాలో పప్పీల వీడియోలు బాగా వైరలవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను ఫిదా చేస్తోంది. మెట్లెక్కేందుకు ఓ పప్సీ తీవ్ర ఇబ్బందులు పడుతుండడం చూసిన మరో పప్పీ సాయపడడం నెటిజన్ల మదిని దోచుకుంటోంది.

నిజమైన ఫ్రెండ్ అంటూ.. కాగా పప్పీస్‌ అనే యూజర్‌ తన ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు. ఇందులో ఓ కుక్క పిల్ల మెట్లు ఎక్కేందుకు ఇబ్బందిప‌డుతుంటుంది. దీంతో అక్కడికొచ్చిన మరో కుక్కపిల్ల మెట్లపై ప‌డుకోగా.. దానిపై నుంచి కుక్కపిల్ల మెట్లెక్కుతూ ఉంటుంది. ‘నిజ‌మైన స్నేహితుడు’ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. వ్యూస్‌ల వర్షం కురవడంతో పాటు రీట్వీట్లు చేస్తున్నారు. ‘ట్రూ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ ఇలాగే సాయం చేసుకుంటుంటారు’, ‘క్యూట్‌ వీడియో’, నెటిజన్లు హార్ట్ అండ్‌ లవ్ ఎమోజీలతో కామెంట్లు కురిపిస్తున్నారు. మరి నెట్టింట హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Ranbir Kapoor: వివాహమైన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లాం.. మ్యారేజ్‌ లైఫ్‌పై చాక్లెట్‌ బాయ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..

Chiranjeevi: మహేశ్‌ను చూస్తోంటే గర్వంగా ఉంది.. మేజర్ సినిమాపై మెగాస్టార్‌ ప్రశంసలు.. చెవి పోగులతో చిరు లుక్‌ వైరల్‌..