Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..

Kajal Agarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌ (Kajal Agarwal). ఆ తర్వాత చందమామ సినిమాలో నటించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. మగధీర, డార్లింగ్‌, బృందావనం..

Kajal Agarwal: ముద్దుల కుమారుడి మరో ఫొటోను షేర్‌ చేసిన చందమామ.. ఈసారి ముఖం  కనిపించేలా.. వైరలవుతోన్న క్యూట్‌ ఫొటో..
Kajal Agarwal
Follow us
Basha Shek

|

Updated on: Jun 14, 2022 | 7:13 AM

Kajal Agarwal: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది కాజల్‌ అగర్వాల్‌ (Kajal Agarwal). ఆ తర్వాత చందమామ సినిమాలో నటించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. మగధీర, డార్లింగ్‌, బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, బిజినెస్‌ మెన్‌, టెంపర్‌, ఖైదీ నంబర్‌ 150 తదితర ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా బిజీ కెరీర్‌ కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి నీల్‌ కిచ్లూ అని నామకరణం కూడా చేసింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యంలో తేలియాడుతోన్న ఈ అందాల తార తన కుమారుడి ఫొటోలు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. అయితే ఎక్కడ కూడా ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. తాజాగా తన ముద్దుల కుమారుడి మరో ఫొటోను అభిమానులతో పంచుకుంది కాజల్‌.

కాగా ఈ పిక్‌లో మాత్రం తన బిడ్డ ముఖం కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో బాబును కాజల్ ఒకవైపుకు ఎత్తుకుని బెడ్‌పై పడుకుని ఉండడం, నీల్‌ తన చేతిని ఫేస్‌కు అడ్డుగా పెట్టడం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ‘చందమామా కుమారుడు చాలా క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే హే సినామిక సినిమాలో చివరిగా కనిపించింది కాజల్‌. దుల్కర్‌ సల్మాన్‌, అదితీరావు హైదరీ ఈ సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. కాగా ప్రస్తుతం పిల్లాడి ఆలనాపాలనలో బిజీగా ఉంటోన్న ఈ పంచదార బొమ్మ సినిమాలు చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 Also Read:

Chiranjeevi: మహేశ్‌ను చూస్తోంటే గర్వంగా ఉంది.. మేజర్ సినిమాపై మెగాస్టార్‌ ప్రశంసలు.. చెవి పోగులతో చిరు లుక్‌ వైరల్‌..

Saliva: నోటిలో లాలాజలం ఎక్కువగా రావడానికి ఇవే కారణాలు ఇవే.. ఉపశమనం పొందడానికి చిట్కాలు

Love Murder: ఇంత కిరాతకమా? విందు ఇస్తానని పిలిచి చెల్లిని, బావను క్రూరంగా చంపిన అన్న..!