Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..

Anushka Shetty:  ప్రముఖ నటి అనుష్క శెట్టి (Anushka Shetty) సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గ్యాంగ్‌స్టర్ల మధ్య విభేదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Anushka Shetty: అనుష్క సోదరుడి హత్యకు కుట్ర.. భద్రత కల్పించాలని హోం మంత్రికి వినతి పత్రం..
Anushka Shetty
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:32 PM

Anushka Shetty:  ప్రముఖ నటి అనుష్క శెట్టి (Anushka Shetty) సోదరుడి హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గ్యాంగ్‌స్టర్ల మధ్య విభేదాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరుకు చెందిన మాఫియా డాన్ ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్‌ రాయ్‌, గుణరంజన్‌శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. అయితే ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. పరస్పర విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు. జయ కర్ణాటక సంస్థకు చెందిన ముత్తప్ప రాయ్ బంధువు మన్మిత్ రాయ్.. గుణరాజన్ శెట్టి హత్యకు స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మన్మిత్ రాయ్ విదేశాల్లో ఉన్న సమాచారాన్ని పోలీసులు సేకరించారు. గుణరంజన్ హత్య స్కెచ్ కోసం బంట్వాళలోని ముత్తప్ప రాయ్ సన్నిహితుడు రంగేష్ మల్లియన్‌ను మంగళూరు పోలీసులు పిలిపించారు. రాకేష్‌ మల్లి, మన్మిత్‌లు సన్నిహితంగా ఉండడంతో పోలీసులు ఇదే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చిన గుణరంజన్‌.. జయ కర్ణాటక జనతా పార్టీ ఫోరమ్‌ను స్థాపించారు. మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దీంతో అసూయతో మన్విత్‌ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు తనపై వస్తోన్న ఈ ఆరోపణలను మన్విత్‌ రై తోసిపుచ్చారు. తాను విదేశాల్లో ఉంటున్నానని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

IND vs SA: కళ్లు చెదిరే బంతికి హార్దిక్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ప్రొటీస్‌ బౌలర్‌ సెలబ్రేషన్స్‌..

Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..

IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..