IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..

IPL Media Rights Auction: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రసార హక్కుల వేలం హోరాహోరీగా సాగుతోంది. 2023-27 కాలానికి గానూ ముంబైలో బీసీసీఐ ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా.

IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..
ICC Board Meet
Follow us
Basha Shek

|

Updated on: Jun 13, 2022 | 7:10 AM

IPL Media Rights Auction: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) ప్రసార హక్కుల వేలం హోరాహోరీగా సాగుతోంది. 2023-27 కాలానికి గానూ ముంబైలో బీసీసీఐ ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా.. తొలి రోజు ఆదివారం వేలం ముగిసేసరికి మీడియా హక్కుల విలువ రూ. 42 వేల కోట్లు దాటినట్లు సమాచారం. నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్వహిస్తున్న ఈ-వేలంలో.. ప్రధానంగా ముఖేశ్‌ అంబానీకి చెందిన వయాకామ్‌ 18, డిస్నీ స్టార్‌, సోనీ, జీ పోటీపడుతున్నాయి. కాగా నేడూ ఈ-బిడ్డింగ్‌ కొనసాగనున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ ఊహించని ధర పలికే అవకాశాలున్నాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న పోటీని చూస్తోంటే.. రూ. 50 వేల కోట్ల మార్క్‌ను దాటినా ఆశ్యర్చపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలో ఈ క్రీడల్లోనైనా ఇదే అతిపెద్ద మీడియా డీల్‌ కావొచ్చు.

ఒక్కో మ్యాచ్‌కు రూ.105 కోట్లు.. కాగా తొలి రోజు ఏడు గంటల పాటు కొనసాగిన వేలం కొనసాగింది. ఏ, బి, సి, డి అనే నాలుగు విభాగాల్లో హక్కులు దక్కించుకునేందుకు కంపెనీలు పోటీపడ్డాయ. అందులో ప్యాకేజీ-‘ఏ’లో స్వదేశంలో టీవీ ప్రసార హక్కులు, ప్యాకేజీ-‘బి’లో స్వదేశంలో డిజిటల్‌ హక్కులుల భారత్‌లో టీవీ ప్రసార హక్కులు, భారత్‌లో డిజిటల్‌ హక్కులు, ప్యాకేజీ-‘సి’లో నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ డిజిటల్‌ హక్కులు, ప్యాకేజీ-‘డి’లో ఓవర్సీస్‌ టీవీ, డిజిటల్‌ హక్కులు ఉన్నాయి. కాగా ప్రస్తుతం బిడ్డింగ్‌ కొనసాగుతున్న పరిస్థితిని చూస్తోంటే.. ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌ హక్కుల కోసం కంపెనీలు రూ. 105 కోట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యాయి. రెండో రోజు దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ఒక్కో ఐపీఎల్‌ మ్యాచ్‌కు కనీసం రూ. 49 కోట్ల బేస్‌ ప్రైజ్‌ను నిర్ణయించాం..అయితే తొలి రోజు బిడ్డింగ్‌ ముగిసే సరికి టీవీ, డిజిటల్‌ హక్కులు కలుపుకొని దాని విలువ రూ. 105 కోట్లు దాటింది. మా అంచనా ప్రకారం మొత్తం విలువ రూ. 50 వేల కోట్లు దాటుతుందనునుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో కంటే త్రిబుల్‌..

కాగా 2017లో 2018-22కి గాను అయిదేళ్ల కాలానికి ప్రసార హక్కుల కోసం 14 సంస్థలు పోటీపడ్డాయి. ఈ సారి ఏడు సంస్థలు.. డిస్నీ స్టార్‌, సోనీ, రిలయన్స్‌ వయాకామ్‌, జీ, ఫన్‌ ఆసియా, సూపర్‌ స్పోర్ట్‌, టైమ్స్‌ ఇంటర్నెట్‌ బిడ్డింగ్‌లో నిలిచాయి. అప్పుడు డిస్నీ స్టార్‌ రూ. 16,347 కోట్లకు ఐపీఎల్‌ హక్కులు దక్కించుకోగా.. ఇప్పుడా ధర మూడు రెట్లు పెరగడం గమనార్హం.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Telangana: నేటి నుంచి తెలంగాణలో తెరచుకోనున్న పాఠశాలలు.. బడి బాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు..

Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 40 మందికి గాయాలు

TS TET 2022 Results: తెలంగాణ టెట్‌ 2022 ప్రశాంతంగా..90 శాతం హాజరు! ఫలితాలు ఎప్పుడంటే..