Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలోని అల్లూరిసీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ..

Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. 40 మందికి గాయాలు
Road Accident
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:46 PM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏపీలోని అల్లూరిసీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడి ఐదుగురు మృతి చెందగా, 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా భవానీపట్నం నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు ధనేశ్వర్‌ దళపతి(24), జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2) కాగా మరో ఇద్దరు ఉన్నారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే..

ఇవి కూడా చదవండి

బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఒడిశాలోని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్