AP: సాధారణ వాహన తనిఖీలు.. ఓ వ్యక్తి బైక్‌లో దొరికిన లెటర్స్ చూసి పోలీసులు షాక్.. వెంటనే
బక్కరాయసముద్రం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో ఎదురయ్యాడు. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. బైక్‌లో 5 లేఖలు బయటపడ్డాయి.
Anantapur district: అనంతపురం జిల్లాలో ఓ జులాయి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా.. అతడిని ఆపారు పోలీసులు. కానీ అతని వద్ద దొరికిన లెటర్స్ చూసి స్టన్ అయ్యారు. ఎల్లనూరు(Yellanur) మండలం కూచివారిపల్లి గ్రామానికి చెందిన చక్రపాణి మద్యానికి బాగా అడిక్ట్ అయ్యాయి. పనీ పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. డైలీ లిక్కర్ తాగడంతో అప్పులు పెరిగిపోయాయి. అయినా కానీ అతడు ఏదైనా పని చూసుకోలేదు. ఈజీ మనీ కోసం స్కెచ్ వేశాడు. ఓ ఫ్రెండ్ ఇచ్చిన వెదవ ఐడియాతో కొత్త ప్లాన్ వేశాడు. యూట్యూబ్‌లో చూసి బ్లాక్‌మెయిలర్‌గా మారాడు. గతంలో తన తల్లికి, అత్తకు వైద్యం చేసిన కుమార్ అనే డాక్టర్‌ను టార్గెట్ పెట్టుకున్నాడు. అతడిని బెదిరించి డబ్బు గుంజాలని చూశాడు. అందుకు తగ్గట్లుగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు.
“బెంగళూరు హైవే పక్కన ఉన్న అశోక్ లేలాండ్ షో రూం ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేసులో రూ. 20 లక్షల పడేసి వెళ్లాలి. అడిగినంత ఇవ్వకపోతే నీ ప్రాణాలు దక్కవు. సింగిల్‌గా వచ్చి డబ్బు అక్కడ పెట్టి వెళ్లాలి. ఈ విషయం పోలీసులకు చెప్పినా, తేడాగా వ్యవహరించినా కాల్చి పడేస్తా” అంటూ లెటర్లు రాసి తన బైక్‌లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బక్కరాయసముద్రం వద్ద సాధారణ తనిఖీలు చేపట్టిన పోలీసులకు చక్రపాణి ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. బైక్‌లో 5 బెదిరింపు లేఖలు బయటపడ్డాయి. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం కక్కేశాడు. డాక్టర్ల వద్ద డబ్బులు బాగా ఉంటాయి కాబట్టి.. ఈజీ మనీ సంపాదించాడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చక్రపాణి అంగీకరించాడు. డాక్టర్ కుమార్‌తో పాటు నలుగురైదుగురికి బెదిరింపు లేఖలు పంపితే ఎవరో ఒకరు భయపడి డబ్బులు తెచ్చి పడేసి వెళ్తారనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశానని వెల్లడించారు. చక్రపాణితో పాటు అతనికి సలహా ఇచ్చిన ఫ్రెండ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..