AP Gurukula Admissions 2022: ఏపీ గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ 2022-23 విడుదల
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం (జూన్ 12) ఏపీఆర్‌ఈఐఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది..
APRS 6th, 7th, 8th Class Admission Notification 2022-2023: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఆదివారం (జూన్ 12) ఏపీఆర్‌ఈఐఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలను లాటరీ పద్ధతిలో కల్పించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఆర్ నరసింహారావు తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 సాధారణ, 11 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను జులై ఆటోమేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ (లాటరీ) పద్ధతిలో విద్యార్ధులకు కేటాయిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.50లు చెల్లించవల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆయా తరగతులకు దిగువ తరగతి చదివిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారి తల్లిదండ్రుల ఆదాయం ఏడదికి రూ.లక్షకు మించరాదు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ aprs.apcfss.inలో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.