CCS Police Raids: ఆ నేత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు, అరుదైన, కోట్ల విలువైన విగ్రహం స్వాధీనం, అన్నీ ట్విస్టులే!

ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో అత్యంత అరుదైన, కోట్ల విలువ చేసే మరకత పంచముఖ వినాయక విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..జిల్లాలోని ఎర్రగొండపాలెంలో

CCS Police Raids: ఆ నేత ఇంట్లో ఆకస్మిక తనిఖీలు, అరుదైన, కోట్ల విలువైన విగ్రహం స్వాధీనం, అన్నీ ట్విస్టులే!
Emerald Idol
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:45 PM

ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో అత్యంత అరుదైన, కోట్ల విలువ చేసే మరకత పంచముఖ వినాయక విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..జిల్లాలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఈ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న అదే పార్టీకి చెందిన మరో నేతను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదే విగ్రహాన్ని హైదరాబాద్‌లో గతంలో ఒకసారి పట్టుకున్నారు..ఈ నేపద్యంలో ఆ విగ్రహం తమ గ్రామంలోని దేవాలయానికి సంబంధించిందంటూ కోర్టు ద్వారా అనుమతి తీసుకుని గ్రామానికి తెచ్చామని నిందితులు చెప్పడంతో ఆధారాలు సమర్పించాలని పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని 41 నోటీసులు ఇచ్చి పంపించారు… మరోవైపు ఈ విగ్రహానికి సంబంధించి పోలీసులపై ఉన్నతస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావడంతో విగ్రహాన్ని వారి వద్ద ఉంచుకొని నిందితులను వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఎర్రగొండపాలెంలోని వైసీపీ నేత వెంకటేశ్వరరెడ్డి నివాసాన్ని ఒంగోలు సీసీఎస్‌ పోలీసులు రెండు రోజుల క్రితం సోదా చేశారు. ఇంట్లో ఉన్న మరకత పంచముఖ వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరెడ్డితోపాటు ఆ సమయంలో ఆయనతోపాటు ఉన్న మండలంలోని గోళ్లవిడిపికి చెందిన మరో వైసీపీ నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అవసరమైన అనుమతులున్నాయని వెంకటేశ్వరరెడ్డి చెప్పడంతో ఉత్తర్వులు తీసుకురావాలని చెప్పి వారిని విడుదల చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. దీని వెనుక ఎర్రగొండపాలెంలోని ఓ పంచాయతీ కార్యదర్శి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు… ఈ విగ్రహాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలియడంతో సమాచారం అందుకున్న పోలీసులు తామే కొనుగోలుదారుల అవతారం ఎత్తారు… ఒంగోలు సిసియస్‌ సిఐ దేవప్రభాకర్‌ ఆద్వర్యంలో వెంకటేశ్వరరెడ్డితో బేరసారాలు చేశారు… 25 కోట్లకు బేరం కుదుర్చుకున్న ఒంగోలు సిసియస్‌ పోలీసులు విగ్రహాన్ని పరిశీలించాలంటూ వెంకటేశ్వరరెడ్డి ఇంటికి వెళ్ళారు… విగ్రహాన్ని చూసి కన్‌ఫర్మ్‌ చేసుకున్న పోలీసులు వెంటనే విగ్రహాన్ని స్వాదీనం చేసుకున్నారు… విగ్రహాన్ని ఇంట్లో దాచిన వెంకటేశ్వరరెడ్డిని, ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్న మరో వైసిపి నేత గజ్జెల చెన్నయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు… అయితే వీరిద్దరూ వైసిపి నేతలు కావడంతో పాటు స్తానిక ప్రజా ప్రతినిధికి ముఖ్య అనుచరులు కావడంతో వెంటనే సిసియస్‌ పోలీసులపై వత్తిడి తెచ్చారు… దీంతో ఒంగోలు సిసియస్‌ పోలీసులు విగ్రహాన్ని, నిందితులను స్థానిక ఎర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెనుతిరిగారు… రెండు రోజుల పాటు విచారించిన ఎర్రగొండపాలెం పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు… సెక్షన్‌ 41 కింద నిందితులకు నోటీసులు ఇచ్చి పంపించారు… గతంలో కోర్టు నుంచి తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్న ఆధారాలను తీసుకురావాలని కోరారు.

ఖరీదైన మరకత పంచముఖ వినాయక విగ్రహం తన ఇంట్లో ఉంచుకున్న విషయంపై ఎర్రగొండపాలెంలోని వైసిపి నేత వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు… ఆ విగ్రహం తమ వద్ద ఉంచుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. అదే నిజమైతే, అందుకు సంబంధించిన అనుమతి ఉత్తర్వు కాపీలను తమకు చూపించాలని సూచించి, వారిని విడిచిపెట్టారు. ఈ ఖరీదైన విగ్రహాన్ని వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చినట్లు ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఉన్నతస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావడంతో విగ్రహాన్ని వారి వద్ద ఉంచుకొని.. పోలీసులు నిందితులను కేసు నమోదు చేసుకుని నోటీసులు ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తోంది. ఓ పంచాయతీ కార్యదర్శి హస్తంతో పాటు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అతని బంధువు ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు… ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పుడే మాట్లాడలేమని అంటున్నారు… విచారణ పూర్తయిన తరువాత వివరాలు వెల్లడిస్తామని ఎర్రగొండపాలెం ఎస్‌ఐ కోటయ్య చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు