Viral: భర్తలు కొట్టినా పర్లేదు.. మహిళల మాట ఇదే.. ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే.!
మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. కాని, మహిళలు మాత్రం..
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. చాలా దేశాల్లో విధాన నిర్ణయాల్లోనూ స్త్రీలు కీలక పాత్ర పోషిస్తుండటం మనం గమనిస్తున్నాం. కొన్ని కొన్ని సర్వేలు చిత్ర విచిత్రమైన విషయాలు వెలుగులోకి తీసుకువస్తాయి. మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హింసను కట్టడి చేసేందుకు అనేక కఠిన చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. కానీ చాలామంది మహిళలు డొమెస్టిక్ వయలెన్స్ అంటే గృహ హింసకు ఆమోదం తెలుపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది షాకింగ్ కలిగిస్తోంది.
దేశంలో మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి. కాని, మహిళలు మాత్రం కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని అంగీకరిస్తున్నారు. కేంద్రం తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదు నిర్వహించింది. కొన్ని సందర్భాల్లో తమ భర్తలు కొట్టడాన్ని తాము తప్పుగా భావించడం లేదని ఈ సర్వేలో పాల్గొన్న గృహిణుల్లో చాలామంది చెప్పారు. ఇలా సమర్థించే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉండటం షాక్ కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా భార్యలు భర్తలు కొట్టడాన్ని సమర్థించారు.
నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో 83.8 శాతంతో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. స్వల్ప తక్కువతో అంటే 83.6 శాతంతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, దమన్, డయ్యూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు. పురుషులపరంగా చూస్తే కర్ణాటకలో 81.9 శాతం మంది మగమహారాజులు భార్యను కొట్టడం తప్పేమి కాదని భావిస్తున్నారు.
భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా పురుషుల్లో తగ్గుతోంది. దాదాపు 25 శాతం భర్తలు తమ భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. భార్యను కొట్టడం తప్పేమి కాదనే అభిప్రాయం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించింది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు.
ఈ వార్త గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..