Viral: దేవుడ్ని ప్రార్ధిస్తుండగా వచ్చిన అనుకోని అతిధి.. ఒక్కసారిగా భయంతో అందరి మైండ్ బ్లాంక్..

ఇదొక క్రేజీ న్యూస్.. షాకింగ్ కూడానూ.. దేవుడ్ని ప్రార్ధిస్తున్న ఓ కుటుంబం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. అనుకోని అతిధి వల్ల..

Viral: దేవుడ్ని ప్రార్ధిస్తుండగా వచ్చిన అనుకోని అతిధి.. ఒక్కసారిగా భయంతో అందరి మైండ్ బ్లాంక్..
Representative ImageImage Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2022 | 11:54 AM

ఫారెస్ట్ సరిపోలేదో.. లేక మరేదైనా కారణమో.. ఈ మధ్యకాలంలో సరీసృపాలు తమ ఆవాసాలను వదిలిపెట్టి జనావాసాలకు వచ్చేస్తున్నాయి. అలాంటి సంఘటనలు మనం చాలానే చూస్తున్నాం. ఆ కోవకు చెందిన ఓ ఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని రిజర్వాయిర్ హిల్స్‌లో వెలుగు చూసింది.

ఓ కుటుంబం తమ ఇంటిలోని ప్రార్ధనా మందిరంలో ప్రార్ధిస్తుండగా.. ‘హిస్.. హిస్..’ అంటూ వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని ఆ గది నలువైపులా చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. అయితే ఆ శబ్దాలు మాత్రం దేవుడి గదిలో ఉన్న ఓ కన్నం నుంచి వస్తోందని గుర్తించారు. వారికి షాకిస్తూ అనుకోని అతిధిలా ఓ నాగుపాము అందులో తిష్ట వేసింది. దెబ్బకు విషయాన్ని స్నేక్ క్యాచర్‌కు అందించారు. స్థానికంగా ఉన్న నిక్ ఎవాన్స్ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ కన్నం నుంచి పామును చాకచక్యంగా బయటికి తీశాడు. ఆ తర్వాత దాన్ని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీనితో ఆ కుటుంబంలోని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా బూడిద, ఆలివ్ గోధుమ రంగుల్లో ఉంటాయని ఓ వెబ్‌సైట్ పేర్కొంది. అది మనుషులను కాటేస్తే క్షణాల్లో కాటికి పోవడం ఖాయమట. దక్షిణాఫ్రికాలో నమోదైన పాము కాటు కేసుల్లో.. ఈ పాము బారినపడ్డ వారే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ పాము విషం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, బొబ్బలు వస్తాయట. ఇలాంటి పాములు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి.