AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సిక్సర్ అదిరింది.. బీర్ గ్లాస్ పగిలింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

లాంగాన్‌ మీదుగా సిక్సర్‌‌గా మలిచిన మిచెల్.. గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళ చేతిలోని బీర్‌ గ్లాస్‌లో పడింది. దీంతో ఆ గ్లాస్ పగిలిపోయింది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే, అసలు విషయం తెలుసుకున్న కివీస్ టీం..

Watch Video: సిక్సర్ అదిరింది.. బీర్ గ్లాస్ పగిలింది.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Viral Video: New Zealand all-rounder Daryl Mitchell's six
Venkata Chari
|

Updated on: Jun 11, 2022 | 11:59 AM

Share

క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా ఆడుతున్న సమయంలో భారీ బౌండరీలతోపాటు, సిక్సర్లు కూడా వస్తుంటాయి. వీటిలో కొన్ని స్టేడియం అవతల పడితే, మరికొన్ని గ్యాలరీలో అద్దాలతోపాటు ప్రేక్షకులకు తాకుతుంటాయి. తాజాగా ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లోనూ ఇలాంటిదే జరిగింది. బ్యాట్స్‌మెన్ కొట్టిన ఓ బంతి ఏకంగా గ్యాలరీలో కూర్చున్న మహిళ చేతిలోనే బీర్ గ్లాస్‌ను తాకి, పగలగొట్టింది. న్యూజిలాండ్ ఆల్ రౌండ్ డారిల్ మిచెల్.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుత ఫామ్‌తో దూసుకపోతున్నాడు. లార్డ్స్‌లో తన సెంచరీని పూర్తి, ట్రెంట్ బ్రిడ్జ్‌లోనూ అదేఫాంతో బౌర్లకు చుక్కలు చూపిస్తు్న్నాడు. అజేయంగా 81 పరుగుతో దూసుకపోతున్న తరుణంలో మిచెల్ రెండు సిక్సర్లు బాదేశాడు. ఇందులో ఓ సిక్స్ నేరుగా వెళ్లి గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళ బీర్ గ్లాస్‌లో పడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.

ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నాటింగ్‌హామ్‌ వేదికగా శుక్రవారం రెండో టెస్ట్ జరగుతోంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న న్యూజిలాండ్ టీం మొదలటి రోజు ఆట పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 318 పరుగులతో నిలిచింది. కాగా, ఈ మ్యాచ్‌లో మిచెల్‌ 81 నాటౌట్‌, టామ్‌ బ్లండెల్‌ 67 నాటౌట్‌ హాఫ్ సెంచరీలతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఇంగ్లండ్ బౌలర్ జాక్‌ లీచ్‌ విసిరిన ఓ బాల్‌ను లాంగాన్‌ మీదుగా సిక్సర్‌‌గా మలిచిన మిచెల్.. గ్యాలరీలో కూర్చున్న ఓ మహిళ చేతిలోని బీర్‌ గ్లాస్‌లో పడింది. దీంతో ఆ గ్లాస్ పగిలిపోయింది. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే, అసలు విషయం తెలుసుకున్న కివీస్ టీం మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఆ మహిళకు మరో బీర్‌ గ్లాస్‌ ఆఫర్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..