BJP orders: దళిత కవి రాసిన కవిత, పాఠ్యాంశం నుండి తొలగించాలంటూ సర్కార్ ఆదేశాలు..

పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఓ వైపు ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను అంతేజోరుగా ముందుకు కొనసాగిస్తోంది. తాజాగా

BJP orders: దళిత కవి రాసిన కవిత, పాఠ్యాంశం నుండి తొలగించాలంటూ సర్కార్ ఆదేశాలు..
Poem
Follow us

|

Updated on: Jun 13, 2022 | 12:41 PM

పాఠ్యపుస్తకాలలో సిలబస్ మార్చే కార్యక్రమం శరవేగంగా పూర్తి చేస్తోంది కర్నాటక ప్రభుత్వం. ఓ వైపు ప్రతి పక్షాలు ఈ వ్యవహారాన్ని విమర్షిస్తుండగానే బీజేపీ సర్కారు మాత్రం తన ప్రణాళికను అంతేజోరుగా ముందుకు కొనసాగిస్తోంది. తాజాగా కర్ణాటక విద్యాశాఖ మంత్రి తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది. 4వ తరగతి పాఠ్యపుస్తకం నుండి దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ‘భూమి’ అనే కవితను తొలగించాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బి.సి.నగేష్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

దివంగత దళిత కవి సిద్దలింగయ్య రచించిన ఆ కవిత లో సూర్య, చంద్రులు దేవుళ్ళు కాదని, భగవంతుణ్ణి, ఆత్మను ఎవరూ చూడలేదని చెప్పుకొచ్చారు. శాస్త్రాలు, పురాణాలు అబద్ధాల మూటలేనని కవి సిద్దరామయ్య రచించారు. చాలా ఏళ్ళుగా ఆ కవిత 4వ తరగతి పాఠ్యాంశాల్లో బోధిస్తున్నారు. అయితే హిందుత్వ భావాలకు వ్యతిరేకంగా ఉన్న పాఠ్యాంశాలన్నింటినీ తొలగించాలని నిర్ణయం తీసుకున్న కర్ణాటక బీజేపీ సర్కారు ‘భూమి’ కవితను కూడా తొలగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కవిత వల్ల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఈ పద్యం కాంగ్రెస్ హయాంలో పరిచయం చేయబడింది. అప్పటి బరగూరు రామచంద్రప్ప నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ ఈ కవితను సిలబస్‌లో పొందుపరిచింది. కాగా, ఈ కవితపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకంలోని అంశం వివాదాస్పదంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రోహిత్‌ చక్రవర్తి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచించిన మార్పులను అనుసరించి ఎట్టకేలకు ఈ కవితను సిలబస్‌ నుంచి తొలగిస్తూ నిర్ణయం వెలువడింది. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌ సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!