AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహం.. 5 కిలోమీటర్లు నడిచి వెళ్లిన వ్యక్తి

ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగేళ్ల ఓ చిన్నారి చనిపోతే.. ఆ శవాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌ దొరకలేదు. కనీసం బస్సులోనైన వెళ్దామంటే ఎక్కించుకోలేదు.. చివరకు చేసేది లేక

గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహం.. 5 కిలోమీటర్లు నడిచి వెళ్లిన వ్యక్తి
Carry Niece's Body
Jyothi Gadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 13, 2022 | 11:52 AM

Share

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఓ ఘటన మన దేశంలో ఉన్న దయనీయ స్థితులకు మరోమారు అద్దం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగేళ్ల ఓ చిన్నారి చనిపోతే.. ఆ శవాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్‌ దొరకలేదు. కనీసం బస్సులోనైన వెళ్దామంటే ఎక్కించుకోలేదు.. చివరకు చేసేది లేక ఆ శవాన్ని భుజాలపై మోస్తూ.. 5 కి.మీ. నడిచి ఇంటికి తీసుకెళ్లాడు ఆ చిన్నారి మేనమామ. గుండెల నిండా దు:ఖంతో ఆ మేనమామ అనుభవించిన నరకం అందరినీ కలిచివేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని సంఘటనపై అధికారులు ఆరా తీయగా… ఛతర్‌పుర్‌ జిల్లాలోని పౌడీ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు సమీపంలోని బుక్స్‌వాహా హెల్త్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించగా, వైద్యుల సూచన మేరకు దామో జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని దుప్పటితో కప్పి మేనమామ భుజంపై వేసుకుని దామో నుంచి బుక్స్‌వాహాకు వచ్చాడు. అక్కడి నుంచి కాలినడకన ఐదు కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామం పౌడీకి తీసుకొచ్చాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వ్యవహారంలో వైద్య సిబ్బంది స్పందించిన డీఎంహెచ్‌వో విచారణకు ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి