AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎండనుంచి ఉపశమనం పొందేలోపుగానే,.. ఈదురుగాలుల బీభత్సం.. అక్కడ కరెంట్‌ కట్‌!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగేలా వాన కురిసింది అనుకునే లోపే ఈదురుగాలులు అంతా తలక్రిందులు చేశాయి.

Telangana: ఎండనుంచి ఉపశమనం పొందేలోపుగానే,.. ఈదురుగాలుల బీభత్సం.. అక్కడ కరెంట్‌ కట్‌!
Heavy Rainfall
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 6:43 PM

Share

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగేలా వాన కురిసింది అనుకునే లోపే ఈదురుగాలులు అంతా తలక్రిందులు చేశాయి. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోనీ వంపు తండా, లైన్ తండాలలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వంపు తండాలో ఇళ్ళపై ఉన్న రేకులు ఒక్కసారిగా గాలి వాటానికి పైకి ఎగిరి పోయాయి. ఇంటి పై నుండీ లేచిపోయిన రేకులు పంట పొలాలలో పడ్డాయి. మరో మూడు ఇళ్ళు పూర్తిగా నేలమట్టం అయ్యియి. బానోతు స్వామి, కోట్య, బాలు, బాలరాజు అనే రైతుల ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన లో బానోతు స్వామి, విజయ అనే దంపతులతో పాటు, ఐదేళ్ళ చిన్నారికి కూడా గాయాలయ్యాయి. గాయాలపాలైన వారినీ గూడూరు ప్రభూత్వ ఆసుపత్రి

కీ పంపించారు. అలాగే కొన్ని చెట్లు కూడ గాలిధాటికి నేలకొరిగాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో గాలుల తాకిడికి కరెంట్​సప్లయ్​ ఆపేశారు.

ఇదిలా ఉంటే, కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఆదివారం ఆంధ్రా తీరాన్ని తాకిన రుతుపవనాలు.. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాలు సోమవారం తెలంగాణ నేలను తాకనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాల ఎంట్రీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి