18 Pages: విడుదలకు సిద్ధమైన నిఖిల్ సినిమా.. 18 పేజేస్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?..

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట

18 Pages: విడుదలకు సిద్ధమైన నిఖిల్ సినిమా.. 18 పేజేస్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా ?..
18 Pages
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:33 PM

యంగ్ హీరో నిఖిల్  సిద్ధార్థ్ (Nikhil) స్పీడుమీదున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 సినిమా చిత్రీకరణలో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో షూటింగ్ 18 పేజేస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి. ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. తాజాగా ఈ మూవీపై రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాకుండా.. ఇటీవలే నిఖిల్, అనుపమ జంటగా నటిస్తోన్న మరో చిత్రం కార్తికేయ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలసిందే. ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

ఇవి కూడా చదవండి