Venu Udugula: ‘ప్రేమకథను జోడించి మహా కావ్యంగా తీసుకువస్తున్నాను’.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్..

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయగా

Venu Udugula: 'ప్రేమకథను జోడించి మహా కావ్యంగా తీసుకువస్తున్నాను'.. డైరెక్టర్ వేణు ఉడుగుల కామెంట్స్..
Venu Udugula
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:33 PM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం విరాట పర్వం (Virata Parvam). రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేయగా.. పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో కామ్రెడ్ రవన్నగా రానా.. వెన్నెల అనే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం వరంగల్ లో ఆత్మీయ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ” ఏ ప్రాంతంలో అపజయాలు కూడా అగ్నిజ్వాలలై మండుతాయో.. ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యాలై పుడతాయో ఆ ప్రాంతమే ఓరుగల్లు.. ఇక్కడ 1992లో జరిగిన ఓ మరణం నన్ను కదిలించింది. ఒక మహా సంక్షోభం నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటనకు ప్రేమను జోడించి ఓ మహాకావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాను.. రానా ఈ సినిమా ఒప్పుకున్నారంటే ఆది ఆయన గొప్పతనం.. అందరూ చూడాల్సిన సినిమా.. ముఖ్యంగా మహిళలు చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లలోనే విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు తీసుకువచ్చారు…ఈ కథ రాస్తున్నప్పుడే వెన్నెల అనే పాత్ర కల్లోకి వస్తుండే.. లంగావోణి కట్టుకుని.. భుజానికి సంచు వేసుకుని.. చేతిలో డైరీ పట్టుకుని…లో యాంగిల్ లో అలా నడుచుకుంటూ వస్తుంది.. పక్కనే జమ్మికుంట అనే మైలు రాయి ఉంటది.. ట్రైలర్ లో ఆ విజువల్ మీకు కనిపిస్తుంటుంది.. ఆమె పాత్ర అంతా ఇంతా కాదు.. ఆమె మాములు స్త్రీ ప్రేమ కాదు.. శివున్ని ప్రేమించిన సిద్ధేశ్వరి, మల్లిఖార్జున స్వామిని ప్రేమించిన భ్రమరాం.. అక్క మహాదేవి..కవయిత్రి మొల్ల ఇలాంటి ఇతిహాసపు గుణమున్న పాత్ర. వెన్నెల పాత్ర. నిజంగా ఆమె ఈ సినిమాలో నటించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.. మట్టి ముద్దను బాంబుగా మార్చే పాత్రలో రానా నటించాడు.. ఈ సినిమాను ఒప్పుకోవడం రానా గొప్పతనం. వెన్నెల కథలో భాగమయ్యాడు. ” అంటూ చెప్పుకొచ్చారు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి