Virata Parvam: విప్లవ గీతానికి అనుహ్య స్పందన.. రానా పాడిన పాటను మీరు విన్నారా ?

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Virata Parvam: విప్లవ గీతానికి అనుహ్య స్పందన.. రానా పాడిన పాటను మీరు విన్నారా ?
Virata Parvam
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 8:33 PM

డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాట పర్వం (Virata Parvam) సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్‏కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరరెక్కించిన ఈ మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో నిన్న ఛలో ఛలో విప్లవగీతాన్ని విడుదల చేశారు చిత్రయూనిట్. రానా పాడిన పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

మారదులే.. ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే అంటూ సాగే ఈ విప్లవగీతాన్ని హీరో రానా ఆలపించారు. ఆడబిడ్డ రక్షణకై పోరాటం.. దళితుడి ఆత్మగౌరవానికై పోరాటం… పేదోడి ముద్దకై పోరాటం.. ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు అంటూ వచ్చే చరణాలు రొమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఈ పాటను జీలుకర శ్రీనివాస్ రాయగా.. సురేష్ బొబ్బిలి, రానా కలిసి ఆలపించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. నక్సలైట్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో నక్సలైట్ రవన్నగా రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అలాగే ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సోనియా పెళ్లికి బౌన్సర్లతో వచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో
సోనియా పెళ్లికి బౌన్సర్లతో వచ్చిన పల్లవి ప్రశాంత్.. వీడియో
ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ.. ఆ బ్యాంకుల్లో అదిరే ఆఫర్
ఫిక్స్ డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ.. ఆ బ్యాంకుల్లో అదిరే ఆఫర్
భారత్‌తో బలపడుతున్న గల్ఫ్ దేశాల బంధం.. ఇదే నిదర్శనం!
భారత్‌తో బలపడుతున్న గల్ఫ్ దేశాల బంధం.. ఇదే నిదర్శనం!
ఈ వ్యాపార సంస్థల్లో ఏది బెస్ట్.. ఆ రెండు మార్ట్‌ల మధ్య తేడాలివే.!
ఈ వ్యాపార సంస్థల్లో ఏది బెస్ట్.. ఆ రెండు మార్ట్‌ల మధ్య తేడాలివే.!
బాలయ్య, వెంకీల అన్‌స్టాపబుల్ గ్లింప్స్ చూశారా?
బాలయ్య, వెంకీల అన్‌స్టాపబుల్ గ్లింప్స్ చూశారా?
మిథున రాశిలోకి కుజుడు.. కొత్త సంవత్సరంలో వారికి అధికార యోగం
మిథున రాశిలోకి కుజుడు.. కొత్త సంవత్సరంలో వారికి అధికార యోగం
ఏపీని ఇంకా వీడని వర్షాల ముప్పు..
ఏపీని ఇంకా వీడని వర్షాల ముప్పు..
భారత పర్యటనకు ఇంగ్లండ్ జట్టు.. వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదిగో
భారత పర్యటనకు ఇంగ్లండ్ జట్టు.. వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదిగో
భారతదేశంలో ప్రత్యేక రైల్వే స్టేషన్లు..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రత్యేక రైల్వే స్టేషన్లు..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
వామ్మో.. మరో ముప్పు! ఆ ల్యాబ్‌లో 100 ప్రాణాంతక వైరస్‌లు మిస్సింగ్
వామ్మో.. మరో ముప్పు! ఆ ల్యాబ్‌లో 100 ప్రాణాంతక వైరస్‌లు మిస్సింగ్