Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక, శ్రీవారి కొండపై ఉన్నట్టుండి మారిన వాతావరణం, కమ్మేసిన మేఘాలతో..

తిరుమల కొండపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల మరింత అందంగా దర్శనమిస్తోంది. రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఆకాశమంతా దట్టమైన మేఘలు కమ్మేశాయి. దాంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.

Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక, శ్రీవారి కొండపై ఉన్నట్టుండి మారిన వాతావరణం, కమ్మేసిన మేఘాలతో..
Rain In Thirumala
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Jun 13, 2022 | 6:45 PM

దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు మరో 24 రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నట్లు ఇప్పటికే అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలోనే రుతు పవనాల ఎఫెక్ట్ ముందుగా తిరుమల కొండపైనే కనిపిస్తోంది. తిరుమల కొండపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల మరింత అందంగా దర్శనమిస్తోంది. రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఆకాశమంతా దట్టమైన మేఘలు కమ్మేశాయి. దాంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వర్షంతో ఎటు చూసినా వర్షపు నీరు చేరి పోయింది. దాంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, తిరుమాడ వీధులు, లడ్డు కేంద్రం, తిరుమల రోడ్లన్ని జలమయమయ్యాయి. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో గతంలో జరిగిన అనుభవాల రిత్యా అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు.

ఇకపోతే, ప్రతికూల వాతావరణం కారణంగా నైరుతు రుతు పవనాలు మెల్లగా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్‌ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక మరియు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మొదట ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ ప్రాంతాన్ని రుతుపవనాలు తాకుతాయని ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి