AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: అమ్మను మరిపిస్తున్న ఆర్మీ జవాన్‌!..సైనికుడికి సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే తట్టుకోలేరు..

ఈ ఫోటోను హోంమంత్రి హర్ష్‌షాంఘ్వీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్ ఏమిటంటే, ఫోటోతో పాటు "భావోద్వేగాలు, కర్తవ్యం ఒకదానికొకటి కలిసినప్పుడు. హ్యాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ.

Indian Army: అమ్మను మరిపిస్తున్న ఆర్మీ జవాన్‌!..సైనికుడికి సెల్యూట్ చేస్తున్న నెటిజన్లు.. ఎందుకో తెలిస్తే తట్టుకోలేరు..
Indian Army
Jyothi Gadda
|

Updated on: Jun 12, 2022 | 9:18 PM

Share

ప్రజల హృదయాలను గెలుచుకోవడం, శత్రువుపై విజయం సాధించడం విషయంలో భారత సైన్యం ముందు అందరూ విఫలమే..ఇలాంటి పోస్ట్‌లు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిల్లో ఆర్మీ సిబ్బంది కఠినమైన శీతాకాలంలో ఎలా వర్కౌట్ చేస్తుంటారు.ఎక్కడో మంచు ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారో కనిపిస్తుంది. ఈ చిత్రాలు, వీడియోలను చూసినప్పుడు, మనం ఉద్వేగానికి లోనవుతాం, వారిని చూసి స్పూర్తిని పొందుతాం..అలాంటిదే ఇక్క ఓ ఆర్మీ అధికారికి సంబంధించి మరో ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసి మీరు కూడా ఇండియన్ ఆర్మీ సైనికులకు సెల్యూట్ చేస్తారు.

ఈ ఫోటోను హోంమంత్రి హర్ష్‌షాంఘ్వీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్ ఏమిటంటే, ఫోటోతో పాటు “భావోద్వేగాలు, కర్తవ్యం ఒకదానికొకటి కలిసినప్పుడు. హ్యాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ.” అనే క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటోలో ఓ ఆర్మీ అధికారి చిన్న పిల్లాడిని ఒడిలో పెట్టుకుని అంబులెన్స్‌లోని సీటులో కూర్చొన్నాడు. ఆ శిశువుకు ఏదైనా తినిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరొక అధికారి చేతిలో గుడ్డతో అతని పక్కన నిలబడి ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హృదయాన్ని కదిలించే ఈ చిత్రాన్ని చూసిన ప్రజలు ఈ జవాన్‌కు తల వంచి సెల్యూట్‌ చేస్తున్నారు. భారతీయ సైనికులను చూసి గర్విస్తున్నానంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హుమారా, మన దేశ సైనికుడికి సెల్యూట్’ అంటూ వినియోగదారు రాశారు.

ఇవి కూడా చదవండి

అయితే, అలసు విషయం ఏంటంటే..గుజరాత్‌లో ఓ బోర్‌వెల్‌లో పడిపోయిన 18 నెలల బిడ్డను చాకచక్యంగా రక్షించడమే కాదు.. ఆ శిశువు పట్ట ఆర్మీ సిబ్బంది ఎంతో ప్రేమగా వ్యవహరించారు. దీనిని నిరూపిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాబును ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆర్మీ అధికారులు ఎంత బాధ్యతగా వ్యవహరించారో.. ఆ శిశువును ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారో ఆ ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని చూసిన నెటిజన్లు ఆర్మీ సైనికులకు హ్యాట్సాప్ చెబుతున్నారు. మరీ ఈ ఫోటోపై మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!