Minister Jaishankar: ఇప్పుడు ప్రపంచం మనల్ని గౌరవిస్తోంది.. ప్రముఖుల సమావేశంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Minister Jaishankar: విదేశాలలోని భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక మార్పు అద్భుతమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ జయశంకర్‌ ..

Minister Jaishankar: ఇప్పుడు ప్రపంచం మనల్ని గౌరవిస్తోంది.. ప్రముఖుల సమావేశంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
Subhash Goud

| Edited By: Ravi Kiran

Jun 13, 2022 | 6:45 PM

Minister Jaishankar: విదేశాలలోని భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక మార్పు అద్భుతమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ జయశంకర్‌ అన్నారు. వాతావరణం అనుకూలి౦చట౦తో తిరిగి విమానంలో విశాఖకు చేరుకున్న ఆయన.. ఓ ప్రైవేట్ హోటల్‌లో నగరంలోని వివిధ ర౦గాల ప్రముఖులతో సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ హయాంలోని 8 ఏళ్ల భారత విదేశాంగ విధానంపై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను గత 40 ఏళ్లలో ఏ దేశానికి వెళ్లినా మన భారతీయుల్లో తెలుగువారు ప్రత్యేకంగా కనిపిస్తుంటారని, భారత్‌లో వ్యాపారం అంటే ఇపుడు చాలా సులువు అన్న అభిప్రాయం విదేశీయులకు ఉందన్నారు. కరోనాను భారత్ ఎదుర్కొన గలదా? అని ప్రపంచం అనుమానించింది. కానీ 138 కోట్ల మన జనాభాలో అర్హులంతా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మహమ్మారిని మనం సమర్ధంగా ఎదుర్కొన్నామన్నారు.

ఇప్పుడు మనల్ని ప్రపంచం గౌరవిస్తోందని, కరిబియన్, దక్షిణమెరికా దేశాలకు మన టీకాలు ముందుగా చేరాయన్నారు. ఉక్రెయిన్‌ నుండి మనం ఒక్కరమే మన వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురాగలిగామని, మిగతా దేశాల వారు మనం ఎలా చేశామో చూసి అలా చేశారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ మనం ఒక విద్యార్ధిని కోల్పోయామన్నారు. గతంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు రోగంకంటే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయారని ప్రధాని చెప్పారు ఆయన వివరించారు. ఆ దూర దృష్టితోనే కరోనా వల్ల పనికి‌ పోలేని వారందరికీ ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించారని, పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని అన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. అంతర్గత అంశాల గురించి ఇతర దేశాల వారు మాట్లాడటం పద్ధతి కాదని‌, కానీ ఎవరన్నా మన మీద ఆరోపణ చేస్తే మనం ఖండిస్తూ వాస్తవాలను తెలియజేస్తామన్నారు. మన అభివృద్ధి కారణంగా మనం స్వతంత్ర విదేశాంగ విధానం పాటించే దశకు చేరామని, దక్షిణమెరికా దేశాల నుంచి, ముఖ్యంగా వెనెజులా నుంచి క్రూడ్ తేవడం కొంత సమస్యలతో కూడుకున్నదన్నారు. ఆన్ ఎరైవల్ వీసా అనేది దేశాలను, విధానాలను బట్టి మారుతుంది. గంపగుత్తగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కావు. ఐక్య రాజ్య సమితిలో 51 దేశాలకు ప్రాతినిధ్యమే లేదు. ఐరాస 1945 లో ఏర్పాటైంది. దానికి ఎక్స్ పైరి డేట్ లేదంటే కుదరదు. ఐరాసను కొన్ని దేశాలు స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఐరాస వైఫల్యాలవల్లే జి7 వంటి ప్రత్యామ్నాయాలు వస్తున్నాయని, చైనా, భారత్ రెండూ పురాతన చరిత్ర గల దేశాలని, చైనాతో మనం సత్సంబంధాలే కోరుకుంటున్నాము. కానీ ఏకపక్షంగా ఏదీ సాధ్యం కాదని పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu