IND vs SA: కళ్లు చెదిరే బంతికి హార్దిక్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ప్రొటీస్‌ బౌలర్‌ సెలబ్రేషన్స్‌..

IND vs SA 2nd T20: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఫెయిల్‌ కాగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో..

IND vs SA: కళ్లు చెదిరే బంతికి హార్దిక్‌ క్లీన్‌ బౌల్డ్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ప్రొటీస్‌ బౌలర్‌ సెలబ్రేషన్స్‌..
Ind Vs Sa
Follow us

|

Updated on: Jun 13, 2022 | 8:53 AM

IND vs SA 2nd T20: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఫెయిల్‌ కాగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తేలిపోయారు. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0 తేడాతో వెనకబడింది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌ మినహా మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. ఇక మొదటి మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఈ పోరులో పూర్తిగా నిరాశపరిచాడు. మొత్తం 12 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 9 పరుగులు మాత్రమే చేసి వెన్‌ పార్నెల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కాగా అంతకముందు బంతిని పాండ్యా బౌండరీ తరలించాడు.

హార్ట్‌ సింబల్‌తో సెలబ్రేషన్స్‌..

ఇవి కూడా చదవండి

కాగా హార్దిక్‌ను ఔట్‌ చేసిన సమయంలో పార్నెల్‌ సెలబ్రేషన్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘పాండ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అన్నట్లు రెండు చేతులు జోడించి హార్ట్‌ సింబల్‌ చూపించాడు పార్నెల్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్‌ రేపు వైజాగ్‌లో జరగనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

KBC 2022: రూ.2వేల నోట్లలో జీపీఎస్‌ చిప్‌?.. కేబీసీలో బిగ్‌ బీ ఇంట్రెస్టింగ్‌ క్వొశ్చన్‌.. కంటెస్టెంట్ ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..

Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..

IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..