AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBC 2022: రూ.2వేల నోట్లలో జీపీఎస్‌ చిప్‌?.. కేబీసీలో బిగ్‌ బీ ఇంట్రెస్టింగ్‌ క్వొశ్చన్‌.. కంటెస్టెంట్ ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..

Amitabh Bachchan: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (KBC) కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తో్న్న ఈ గేమ్‌ షో..

KBC 2022: రూ.2వేల నోట్లలో జీపీఎస్‌ చిప్‌?.. కేబీసీలో బిగ్‌ బీ ఇంట్రెస్టింగ్‌ క్వొశ్చన్‌.. కంటెస్టెంట్  ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..
Amitabh Bachchan
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2022 | 8:33 PM

Share

Amitabh Bachchan: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (KBC) కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తో్న్న ఈ గేమ్‌ షోకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ప్రేక్షుకుల విశేష ఆదరణతో ఇప్పటికే 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుందీ రియాలిటీ షో. త్వరలోనే ఈ ప్రోగ్రాం 14వ సీజన్‌ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓ ప్రమోషనల్‌ వీడియో ఇటీవలే విడుదలైంది. సోషల్‌ మీడియా సైట్లలో ఉండే నకిలీ సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలనే సందేశంతో రూపొందించిన ఈ 50 సెకెన్ల ప్రొమో వీడియోకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

టీవీల్లో చూసే తెలుసుకున్నా..

ఇవి కూడా చదవండి

కాగా ఈ వీడియోలో హోస్ట్‌ బిగ్‌ బి తన ఎదుట కూర్చున్న కంటెస్టెంట్‌ను ఒక ప్రశ్న అడుగుతారు. ‘వీటిల్లో ఏది జీపీఎస్ టెక్నాల‌జీని కలిగి ఉంటుంది’ అని క్వొశ్చన్‌కు గాను టైప్ రైట‌ర్, టెలివిజ‌న్‌, శాటిలైట్‌, రూ. 2000 నోటు అనే ఆప్షన్లు ఇస్తారు. దీనికి సమాధానంగా కంటెస్టెంట్ చిరున‌వ్వుతో రూ. 2వేల నోటు అని స‌మాధానం చెబుతుంది. ‘క‌చ్చితంగా అదే సమాధానమా?’ అని అమితాబ్ అడగ్గా.. ‘అవును సార్.. ఇది నాకే కాదు..యావ‌త్ దేశానికి తెలుసు’ అని ధీమాగా చెబుతుంది. అనంత‌రం బ‌చ్చన్‌ జీ ఆ స‌మాధానం త‌ప్పు అని, శాటిలైట్ క‌రెక్ట్ ఆన్సర్‌ అని చెబుతాడు. వెంట‌నే ఆ మహిలా కంటెస్టెంట్ ‘సార్ మీరు జోక్ చేయ‌ట్లేదుగ‌దా’ అని అన‌గా.. ‘నేనెందుకు జోక్ చేస్తాను.. జోక్‌ను మీరు నిజ‌మ‌ని నమ్మారు’ అని బిగ్‌ బి రిప్లై ఇస్తారు. జీపీఎస్ చిప్ ఉన్న రెండు వేల రూపాయ‌ల నోట్ల వార్తలు టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో వ‌చ్చాయ‌ని, అలా త‌న‌కు తెలిసింద‌ని ఆమె చెబుతుంది. టీవీలు, సోషల్‌మీడియాలో వ‌చ్చే వార్తలను ఫ్యాక్ట్ చెక్ చేయ‌కుండా నమ్మోద్దని, అలా న‌మ్మడం వ‌ల్లే త‌న కంటెస్టెంట్ గేమ్ ఓడిపోయింద‌ని అమితాబ్ ఆ కంటెస్టెంట్‌కు సూచిస్తారు. ‘ఎవ‌రు ఏది చెప్పినా వినండి.. కాని దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నాకే న‌మ్మండి’ అని ఈ వీడియోకు ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒక్క ట్విటర్‌లోనే దీన్ని పది వేలమందికి పైగా లైక్‌ చేయడం గమనార్హం.

కాగా 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, 1000లు వంటి పెద్దనోట్లను రద్దు చేసి.. కొత్తగా రూ.2,000 నోట్లను చెలామణిలోకి తెచ్చారు. కాగా వీటిల్లో అంతర్గతంగా జీపీఎస్‌ ఉంటుందంటూ కొన్ని టీవీ ఛానళ్లు కథనాలు, వార్తలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..

IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..

Telangana: నేటి నుంచి తెలంగాణలో తెరచుకోనున్న పాఠశాలలు.. బడి బాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు..