Viral Video: కత్తితో నేర్పుగా చకచకా కటింగ్ చేస్తోన్న బార్బర్.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రస్తుతం అందరిలో స్పెషల్ గా కనిపించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు తమపై తామే ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు.. తాము చేసే పనిలో వింత ప్రయోగాలు చేసే వార్తల్లో నిలుస్తుంటారు.

Viral Video: కత్తితో నేర్పుగా చకచకా కటింగ్ చేస్తోన్న బార్బర్.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 13, 2022 | 8:47 AM

Viral Video: సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తుంది. ముఖ్యంగా రోజూ అనేక రకాల వీడియోలు షేర్ చేస్తూ.. సందడి చేస్తున్నాయి. వీటిల్లో కొన్ని  ఫన్నీ వీడియోలను చూసి.. నవ్వకుండా ఉండలేం.. అయితే కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఒక మంగలి.. ఓ వ్యక్తికి జుట్టు కట్ చేస్తున్న వీడియో ఓ వైపు నవ్వు తెప్పిస్తూనే.. మరోవైపు టెన్షన్ కూడా తెప్పిస్తుంది. అంతేకాదు.. ఈ రోజుల్లో కూడా..  బార్బర్ ఇలాంటి  కటింగ్ టూల్స్  వాడుతున్నాడా అని ఆలోచిస్తారు. ఓ బాలుడి జుట్టును కత్తిరించే విధానం చూస్తే షాక్ తింటారు.

ప్రస్తుతం అందరిలో స్పెషల్ గా కనిపించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు తమపై తామే ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు.. తాము చేసే పనిలో వింత ప్రయోగాలు చేసే వార్తల్లో నిలుస్తుంటారు. ఈ ప్రయోగాలు చాలాసార్లు విజయవంతమవుతాయి. మరికొన్ని సార్లు చేసే.. పనులు ప్రజలకు షాక్ ఇస్తాయి. తన కస్టమర్ జుట్టును కత్తిరించడానికి చాలా ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగిస్తున్న ఈ బార్బర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా మంగలి జుట్టును కత్తిరించడానికి దువ్వెన, కత్తెరను ఉపయోగిస్తాడు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో,  మీరు మొక్కలను కత్తిరించడానికి ఉపయోగించే కొడవలి సహాయంతో జుట్టు కట్ చేయడం చూడవచ్చు. ఈ కత్తి  సహాయంతో ఓ  వ్యక్తి జుట్టును చాలా వేగంగా కత్తిరిస్తున్నాడు. అంతేకాదు.. జుట్టు కట్ చేస్తున్న సమయంలో ఎంతో ఎక్కడా తేడా లేకుండా హడావిడి పడకుండా కత్తిరిస్తున్నాడు. అయితే.. ఇలా కత్తితో జుట్టు కట్ చేస్తున్నా ఆ  వ్యక్తి.. ఏ మాత్రం భయపడకుండా.. చాలా ప్రశాంతంగా కొడవలితో జుట్టు కత్తిరించుకోవడం విశేషం.

ఒక్కసారిగా మంగలి చేసిన ఈ ప్రయోగాన్ని చూస్తే  నమ్మరు. తర్వాత నవ్వు ఆపుకోలేరు.. ఈ వీడియో Instagramలో haryanvi_kti_zehar అనే ఖాతాలో షేర్ చేశారు. వేలాది లైక్స్, లక్షాది వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..