AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..

Home Remedies for Diarrhoea: వేసవి కాలంలో అతిసారం అనేది ఒక సాధారణ సమస్య . జీర్ణకోశంలో సమస్యలు తలెత్తితే విరేచనాల ఈ సమస్య వస్తుంది. ప్రధానంగా బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.

Home Remedies for Diarrhoea: అతిసారం బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందండి..
Basha Shek
|

Updated on: Jun 13, 2022 | 7:41 AM

Share

Home Remedies for Diarrhoea: వేసవి కాలంలో అతిసారం అనేది ఒక సాధారణ సమస్య . జీర్ణకోశంలో సమస్యలు తలెత్తితే విరేచనాల సమస్య వస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల వాంతులు, కడుపులో తిమ్మిర్లు, విరేచనాలు కాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అతిసారం కారణంగా నీరు, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు శరీరం నుండి అధికంగా బయటకుపోతాయి. అటువంటి పరిస్థితిలో, శరీరంలో నీరు, ఖనిజాల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా మనిషి బలహీనమైపోతాడు. డయేరియా (Diarrhoea) సమస్యను సకాలంలో నియంత్రించలేకపోతే, అది తీవ్ర రూపం దాల్చుతుంది. ఈక్రమంలో డయేరియా నివారణకు పాటించాల్సిన కొన్ని సహజ చిట్కాలను తెలుసుకుందాం రండి.

కొబ్బరి నీళ్లు..

అతిసారం సమస్యలు తలెత్తినప్పుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, కొబ్బరి నీరు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరంలో నీటి కొరతను దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పీచు కడుపు ఉబ్బరాన్ని అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పు, చక్కెర

అతిసారం విషయంలో ఎలక్ట్రోల్ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. కానీ మీరు ఇంట్లో ఎలక్ట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఉప్పు, చక్కెర ద్రావణాన్ని తీసుకోవచ్చు. ఇది కూడా ఒక రకమైన ఎలక్ట్రోలైట్. ఇది మీ శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. అతిసారాన్ని నియంత్రిస్తుంది.

పెరుగు, జీలకర్ర

పెరుగును ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణిస్తారు. పొట్ట సమస్యల సమయంలో పెరుగు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. మీరు వేయించిన జీలకర్రను గ్రైండ్ చేసి, నల్ల ఉప్పు వేసి తాజా పెరుగు తింటారు. ఇది మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

జీలకర్ర నీళ్లు

జీలకర్ర నీరు కూడా ఈ విషయంలో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని చల్లార్చాలి. దీని తరువాత, ఈ నీటిని ఫిల్టర్ చేసి రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. దీంతో మీ డయేరియా సమస్య త్వరలో అదుపులో ఉంటుంది.

అరటిపండు

అరటిపండు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం. విరేచనాల సమయంలో అరటిపండు తింటే చాలా ఉపశమనం లభిస్తుంది. అయితే బాగా పండిన అరటిపండ్లను మాత్రమే తినండి. పచ్చి అరటిపండు తింటే మీ సమస్యను తగ్గించే బదులు పెంచుతుంది. ఇది కాకుండా, నారింజ, ద్రాక్ష వంటి జ్యుసి పండ్లు కూడా ఈ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఇది గుర్తుంచుకోండి..

ఇక్కడ పేర్కొన్న ఏవైనా నివారణలు మీకు సహాయపడవచ్చు. కానీ వాటిని విరేచనాలకు ఇవే చికిత్సగా తీసుకోకండి. సమస్య పెరుగుతున్నట్లు అనిపిస్తే, వెంటనే నిపుణుడిని సంప్రదించి, అతని సలహాతో మాత్రమే ఈ చిట్కాలు పాటించండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Also Read:

IPL Media Rights Auction: మొదటి రోజే రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్‌ మీడియా రైట్స్.. నేడూ కొనసాగనున్న ఈ-బిడ్డింగ్‌..

Telangana: నేటి నుంచి తెలంగాణలో తెరచుకోనున్న పాఠశాలలు.. బడి బాట పట్టనున్న 60 లక్షల మంది విద్యార్థులు..

Singnificance of Ekadshi: ఏకాదశి విశిష్టత.. తెలుగు నెలల్లో వచ్చే ఏకాదశి పేర్లు.. ఫలం గురించి తెలుసుకోండి..