Tea Side Effects: అలసట తగ్గుతుందని.. ఈరోజూ పదే పదే టీని తాగుతున్నారా..ఈ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..
ఎండాకాలం అయినా, చలికాలం అయినా కొందరు వ్యక్తులు టీ తాగకుండా జీవించలేరు. అయితే టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి
Tea Side Effects: చాలా మందికి టీ తాగడం అలవాటు. టీ తాగకపోతే చాలా మంది అలసటగా ఉందని అంటారు. అందుకనే చాలా మంది యాక్టివ్‌గా ఉండటానికి, అలసట నుంచి ఉపశమనం కోసం టీ తాగుతారు. కొంతమందికి రోజుకు 5 నుంచి 6 కప్పుల టీ తాగే అలవాటు ఉంటుంది. ఎండాకాలం అయినా, చలికాలం అయినా కొందరు వ్యక్తులు టీ తాగకుండా జీవించలేరు. అయితే టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజు టీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.
ఆందోళన అధికమవుతుంది: టీ ఎక్కువగా తాగడం వల్ల ఆందోళన కలుగుతుంది. కొన్ని సార్లు అసౌకర్యంగా భావిస్తారు. టీలో టానిన్లు ఉంటాయి. ఇవి మీ సమస్యను పెంచుతాయి. ఇందులో కెఫిన్ ఉంటుంది. కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల హానిని కలుగజేస్తుంది.
గుండెల్లో మంట: టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఇది ప్రేగులలో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా ఛాతీలో మంట వస్తుంది.
నిద్రలేమి సమస్య: చాలా మంది ఎక్కువ గంటలు పనిచేసే సమయంలో ఎక్కువ టీ తీసుకుంటారు. టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నిద్ర పట్టదు. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర లేని ఏర్పడుతుంది. దీని వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రేగులకు హానికరం: టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పేగులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి జీవక్రియ రేటు వేగంగా ఉండటం అవసరం. అటువంటి పరిస్థితిలో, మనం ఎక్కువ టీని తీసుకున్నప్పుడు, జీవక్రియ రేటు తగ్గుతుంది. దీంతో కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
(నోట్: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)