AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayan Salt Wall: ఈ రెస్టారెంట్‌లో తిన్న తర్వాత .. గోడను రుచి చూడడాల్సిందే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ప్రపంచంలో ఓ రెస్టారెంట్ లో తిన్న తర్వాత.. అక్కడ ఉన్న గోడను.. నాలికతో రుచి చూసి.. ఆస్వాదించి వస్తారు. ఈ రెస్టారెంట్ గురించి మీకు తెలిస్తే.. ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ వింత రెస్టారెంట్ లో అగ్రరాజ్యం అమెరికాలో ఉంది.

Himalayan Salt Wall: ఈ రెస్టారెంట్‌లో తిన్న తర్వాత .. గోడను రుచి చూడడాల్సిందే..  కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Himalayan Rock Salt Wall Re
Surya Kala
|

Updated on: Jun 13, 2022 | 7:57 AM

Share

Himalayan Salt Wall: ప్రపంచంలో  విభిన్న రుచులతోఉన్న ఆహారపదార్ధాలను ఇష్టపడే ప్రజలు.. అందుకు అనుగుణంగా భోజన ప్రియులకు రకరకాల ఆహారాన్ని అందించే అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే కొన్ని రెస్టారెంట్లు.. ఆహారానికి మాత్రమే.. డిఫరెంట్ లుక్ , రకరకాల పద్ధతిలో ఆహారాన్ని కస్టమర్స్ కు అందిస్తూ.. ఆకర్షిస్తుంటాయి. భారతదేశంలోని అహ్మదాబాద్‌లో ఉన్న నేచర్ కాల్ టాయిలెట్ కేఫ్‌ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ రెస్టారెంట్ లో టాయిలెట్ సీటుపై కూర్చొని ప్రజలకు భోజనం పెడతారు. అంతేకాదు.. కాశ్మీర్ లో మంచుతోనే.. టేబుల్స్, చైర్స్ ఉన్న రెస్టారెంట్ భిన్నంగా ఉండి ఆసక్తిని కలిగిస్తాయి. అయితే ప్రపంచంలో ఓ రెస్టారెంట్ లో తిన్న తర్వాత.. అక్కడ ఉన్న గోడను.. నాలికతో రుచి చూసి.. ఆస్వాదించి వస్తారు. ఈ రెస్టారెంట్ గురించి మీకు తెలిస్తే.. ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ వింత రెస్టారెంట్ లో అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. వివరాల్లోకి వెళ్తే..

 USAలోని అరిజోనా మిషన్ అనే ఓ రెస్టారెంట్ ఉంది.  ఈ రెస్టారెంట్ లో భోజనం ఎంత ఫేమస్సో.. ఇక్కడ ఉన్న గోడ కూడా అంతేకాదు.. ఫేమస్.. అందుకనే ఈ రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత గోడను నాలుకతో సృజిస్తారు. ఇక్కడికి వచ్చేవారు ఇలా ఎందుకు చేస్తారు అనే ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంటుంది.

ఈ గోడ  ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే..?  నిజానికి ఈ రెస్టారెంట్ పింక్ హిమాలయన్ సాల్ట్ అంటే పింక్ సాల్ట్‌తో తయారు చేశారు. అందుకనే ఈ రెస్టారెంట్ కు వచ్చేవారు.. తప్పకుండా నాలుకతో ఈ గోడను రుచి చూస్తారు. WLBT3 ప్రకారం, ఈ గోడను హెడ్‌చెఫ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ గోడ రుచి నచ్చింది.

ఇవి కూడా చదవండి

అయితే.. ఈ గోడను కస్టమర్స్ అందరూ నాలికతో రుచి చూస్తారు అని తెలిసినప్పుడు.. చాలామంది మదిలో మరి కరోనా వంటి సమయంలో ఈ రెస్టారెంట్ కు వెళ్లడం ప్రమాదం కదా.. అందుకనే.. ఈ రెస్టారెంట్‌కి కస్టమర్స్ వెళ్లడానికి అస్సలు ఇష్టపడరని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడకు వచ్చే చాలా మంది గోడను నొక్కుతారు.. లేదా నాలికతో రుచి చూస్తారు. అటువంటి పరిస్థితిలో.. ఈ గోడ నుండి ఎన్ని వ్యాధులు ఇతరులకు వ్యాపింపజేస్తాయి అని అంటున్నారు..

అయితే రెస్టారెంట్ సిబ్బంది ఈ ప్రశ్నకు సమాధానంఇస్తూ.. ఈ గోడను తయారు చేసిన రాక్ ఉప్పులో బ్యాక్టీరియాను నశింపజేసే .. శుభ్రపరిచే లక్షణాలు ఉన్నాయని చెప్పారు. గోడను నొక్కినంత మాత్రాన ఎవరూ అనారోగ్యం బారిన పడరని చెబుతున్నారు. అంతే కాదు.. రెస్టారెంట్ లోని సిబ్బంది కూడా ప్రస్తుత పరిస్థితిని.. ఆరోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంతో రోజూ తుడిచి శుభ్రం చేస్తుంటారు.

మరిన్ని మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..