Optical Illusion: 30 సెకన్లలోపు ఈ చిత్రంలో ఉన్న గుడ్లగూబను గుర్తించండి.. మీ కళ్ళకు ఉన్న పవర్ సూపర్బ్
ఈ చిత్రంలో దాక్కున్న గుడ్లగూబను గుర్తించడం.. అది కూడా 30 సెకన్ల కంటే తక్కువ సమయంలో గుర్తించడం కొంచెం కష్టతరం. ఎందుకంటే ఆప్టికల్ ఇల్యూషన్.. ఛాలెంజర్‌లను గందరగోళానికి గురి చేస్తోంది కనుక.. అయితే కొంచెం మనసు పెట్టి.. దృష్టిని కేంద్రీకరిస్తే.. ఎటువంటి ఛాలెంజ్ నైనా ఇట్టే గెలవ వచ్చు అని పలుసందర్భాల్లో రుజువైన సంగతి తెలిసిందే.
Optical Illusion: ఈ చిత్రంలోని ఒక చెట్టు మాను .. అందమైన వుడ్‌ల్యాండ్ దృశ్యంలా కనిపిస్తూ అందంగా ఉంది. అయితే ఆ చెట్టు మానులో ఒక గుడ్లగూబ దాగి ఉంది. దీనిని మీరు ఏదో చూసి.. అయోమయానికి గురవుతారు. ఇంకా చెప్పాలంటే.. మానులో దాగి ఉన్న గుడ్ల గూబని కనుక్కోవాలంటే.. మీరు మీ కళ్ళు రుద్దుకుని మరీ చూడవలసి ఉంటుంది. ఎందుకంటే బహుశా మీరు ఆప్టికల్ భ్రమతో మోసపోయి ఉండవచ్చు.
ఆప్టికల్ భ్రమలు అంటే మనం నిజంగా ఉన్నదానికంటే భిన్నంగా ఆలోచించే విధంగా చేసే చిత్రాలు. మన కళ్ళు మన మెదడుకు ఇచ్చే సమాచారాన్ని పంపేసమయంలో కొంచెం అయోమయానికి గురి చేస్తాయి.. కొంచెం భిన్నంగా ఆలోచించే విధంగా చేస్తాయి..ఇటువంటి చిత్రాలు. అంతేకాదు.. వాస్తవికతతో సరిపోలని విషయాన్ని గ్రహించేలా చేస్తుంది. “భ్రమ” అనే పదం లాటిన్ పదం illudere నుండి వచ్చింది..
అయితే ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు మాను చిత్రంలో నిజంగా గుడ్లగూబ దాక్కుందా? ఉంటె ఎక్కడ ఉంది? దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.. మీరు 30 సెకన్లలోపు గుడ్లగూబను గుర్తించలేకపోతే.. అయ్యో అని ఫీల్ అవకండి.. ఇప్పుడు మానులో దాగి ఉన్న గుడ్ల గూబని గుర్తించేందుకు టిప్స్ చెబుతున్నాం..
చిత్రంలో, ఒక చెట్టు మానుపై ఒక బలమైన బెరడు ఉంది. దానిని పరిశీలించి చూస్తే.. ఒక అందమైన అటవీ దృశ్యాన్ని తలపిస్తుంది.. అందులో మధ్యలో దగ్గరగా చూడండి. ఇప్పుడు మీరు ఏమి గమనించారు? అవును అక్కడే కనిపిస్తుంది గుడ్లగూబ.. సో సింపుల్ గా 30 సెకన్ల కంటే తక్కువ సమయంలో కనిపెట్టారుగా.. అందుకే.. కళ్ళు, మనసు కలిపి పనిచేస్తే.. ఏదైనా ఈజీగా సాధించవచ్చు అని ..
అయితే ఈ గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తాయి. అయితే UKలో, చిన్న గుడ్లగూబ, పొట్టి చెవుల గుడ్లగూబ వంటి కొన్ని గుడ్లగూబలు మాత్రం మిగతా గుడ్లగూబలకి భిన్నం.. ఇవి పగటిపూట వేటాడతాయి.
గుడ్లగూబలు మనుషులు చూసే విధంగానే చూస్తాయని.. రెండు కళ్లూ సూటిగా ముందుకు వస్తాయని చెబుతారు. దీనిని బైనాక్యులర్ విజన్ అని పిలుస్తారు. గుడ్లగూబలు చీకటిలో కూడా స్పష్టంగా చూడగలవు. పక్షిజాతుల్లో గుడ్లగూబలు ఒక ప్రత్యేక వర్గం. ఎక్కువగా ఒంటరిగా జీవిస్తాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..