Mango Leaves Benefits: మామిడి ఆకుల పూజకే కాదు.. పోషకాల గని.. షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ మెడిసిన్..

మామిడి ఆకులను సాధారణంగా పూజలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఈ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..

Mango Leaves Benefits: మామిడి ఆకుల పూజకే కాదు.. పోషకాల గని.. షుగర్ పేషేంట్స్‌కు బెస్ట్ మెడిసిన్..
Mango Leaves
Follow us

|

Updated on: Jun 13, 2022 | 8:19 AM

Mango Leaves Benefits: మామిడి పండుని పండ్లలో రారాజు అంటారు. వేసవి సీజన్‌లో మీరు అనేక రకాల మామిడి పండ్లు లభిస్తాయి. మామిడి పండ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే మామిడి పండ్లు మాత్రమే కాదు.. మామిడి ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా. మామిడి ఆకులను సాధారణంగా పూజలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, బి, ఏ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి మామిడి ఆకులు సహాయపడతాయి.. మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మధుమేహానికి ప్రయోజనకరమైనది మామిడి ఆకులను మధుమేహ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో ఆంథోసైనిడిన్స్ అనే టానిన్లు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆకులు చాలా మేలు చేస్తాయి. మామిడి ఆకులను ఎండబెట్టి పొడిని తయారు చేయండి. ఈ పొడిని క్రమం తప్పకుండా తినండి. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకుల నీటిని రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఈ ఆకులను ఉదయాన్నే వడపోసి, ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

మూత్రపిండాల్లోని రాళ్ల నివారణకు మామిడి ఆకులు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా మామిడి ఆకుల పొడిని వేయండి. రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఈ నీరు మూత్రం ద్వారా మూత్రపిండాల్లోని రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బీపీ నియంత్రిస్తుంది మామిడి ఆకులు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని కోసం మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఈ ఆకులను కషాయంగా సేవించండి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పొట్ట సంబంధిత ఆరోగ్యానికి  మామిడి ఆకులు అనేక పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. ఇందుకోసం మామిడి ఆకులను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. పొట్ట సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు ఈ నీరు పనిచేస్తుంది.

జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అందువల్ల, మామిడి ఆకులు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

(నోట్‌: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

Latest Articles
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
ఆ టయోటా కారు బుకింగ్స్ రీ ఓపెన్.. రూ.13 లక్షలకే సీఎన్‌జీ కారు
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల
నీట్‌ యూజీ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల