Amla Seeds Benefits: ఉసిరి గింజలను పడేస్తున్నారా.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదలరుగా..
ఉసిరి కాయతో పచ్చళ్ళు, రైస్, మురబ్బా వంటి అనేక రకాల ఆహారపదార్ధాలు తయారు చేస్తారు. ఉసిరి కాయను ఉపయోగించి.. తర్వాత దానిలోని గింజలను పడేస్తారు.. అయితే ఈ ఉసిరి విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి..
Amla Seeds Benefits: ఉసిరికాయలో ఔషధ గుణాలున్నాయి. వీటిని తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఉసిరి కాయను కార్తీక మాసంలో పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి కాయతో పచ్చళ్ళు, రైస్, మురబ్బా వంటి అనేక రకాల ఆహారపదార్ధాలు తయారు చేస్తారు. ఉసిరి కాయను ఉపయోగించి.. తర్వాత దానిలోని గింజలను పడేస్తారు.. అయితే ఈ ఉసిరి విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈరోజు ఉసిరి గింజలతో ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
ఉసిరి గింజలో ఉండే పోషకాలు: ఉసిరి గింజల్లో విటమిన్ సీ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, కెరోటిన్, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉన్నాయి.
ఉసిరి గింజలతో ఆరోగ్య ప్రయోజలు:
కంటి సమస్యతో ఇబ్బంది పడేవారు.. ముఖ్యంగా కళ్ళు దురద, మంటలు, ఎర్రబారడం వంటి సమస్యలున్నవారు.. ఉసిరి గింజల పేస్ట్ ను కళ్ళకింద.. పైన రాసుకోవాలి.
జీర్ణ సమస్యలున్నవారు.. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి పొడిచేసుకుని… పొడిని ప్రతిరోజు తీసుకోవాలి.
బరువు తగ్గాలనుకునేవారు.. ఈ పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే బరువు అదుపులోకి వస్తుంది.
మలబద్ధకం, ఆమ్లత్వం సమస్యలతో ఇబ్బందిపడేవారు.. ఈ ఉసిరి గింజలతో తయారు చేసిన పొడిని నీటితో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
ఎక్కిళ్ళ సమస్యకు మంచి ఉపశమనం ఉసిరి గింజల పొడి.. ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
మొటిమలు, చర్మ సమస్యలకు మంచి పరిష్కారం ఉసిరి విత్తనాల పొడి.. ఈ పౌడర్ ను స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలిపి రాయాలి.
వేసవిలో వేడి చేసి ముక్కు నుంచి రక్తం వస్తుంటే.. ఉసిరి గింజల పేస్ట్ ను ముక్కుమీద అప్లై చేయాలి.
తలనొప్పి తో ఇబ్బంది పడుతుంటే.. ఉసిరి గింజలకు కాస్త నీటిని కలిపి గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది.
నిద్రలేమికి కూడా ఉసిరి గింజలు మంచి ఔషధం.. ఉసిరిగింజల పొడిలో పంచదార పొడి కలిపి.. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున ఒక గాజు గ్లాసు నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. ఇలా 15 రోజుల వరకూ చేస్తే.. మంచి నిద్ర పడుతుంది.
మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఉసిరి గింజల పొడి తయారు చేసుకుని..భద్రంగా గాజు సీసాలో భద్రపరచుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)