AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Life: మీ ప్రేమపై మీకు అనుమానమా? అది కేవలం అనుమానం కాదు.. ‘ROCD’ కావచ్చు!

సాధారణంగా ఓసీడీ (OCD) అంటే చేతులు పదే పదే కడుక్కోవడం లేదా వస్తువులను సర్దడం అని మనకు తెలుసు. కానీ 'రిలేషన్‌షిప్ ఓసీడీ' (ROCD) అనేది నేరుగా మన ప్రేమ బంధంపై దాడి చేస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 1 నుండి 4 శాతం మంది ఈ లక్షణాలతో సతమతమవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అధికారికంగా రోగ నిర్ధారణ జాబితాలో లేకపోయినా, దీని ప్రభావం వల్ల అనేక బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి.

Love Life: మీ ప్రేమపై మీకు అనుమానమా? అది కేవలం అనుమానం కాదు.. ‘ROCD’ కావచ్చు!
Relationship Ocd.jpg
Nikhil
|

Updated on: Mar 13, 2026 | 5:53 PM

Share

ప్రేమ అంటే ఒక మధురమైన అనుభూతి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే గాఢమైన నమ్మకం. కానీ, కొందరికి ఈ ప్రేమ బంధమే ఒక పీడకలగా మారుతుంది. భాగస్వామిని ప్రేమిస్తున్నామా లేదా? మనం సరైన వ్యక్తినే ఎంచుకున్నామా? అనే అనుమానాలు వారిని నిరంతరం వేధిస్తుంటాయి. దీనిని కేవలం మనస్పర్థలు అనుకుంటే పొరపాటే.. దీని వెనుక ‘ROCD’ అనే ఒక మానసిక స్థితి దాగి ఉండవచ్చు. అసలు ఈ రిలేషన్‌షిప్ ఓసీడీ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ROCD ప్రధాన లక్షణాలు

ప్రేమలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు సందేహాలు రావడం సహజం, కానీ ROCD ఉన్నవారికి ఆ ఆలోచనలు ఒక వ్యసనంలా మారి నిరంతరం వేధిస్తుంటాయి.

  1. భాగస్వామిలో లోపాలు వెతుకడం- తన భాగస్వామి అందంగా ఉన్నాడా? తెలివైనవాడేనా? వేరే వాళ్ల ముందు ఇతనితో కలిసి వెళ్తే అవమానంగా ఉంటుందా? ఇలా నిరంతరం ఎదుటివారి లోపాలనే గమనిస్తూ ఉంటారు.
  2. ప్రేమపైనే సందేహం- “అసలు నేను ప్రేమిస్తున్నానా? నాకు మునుపటిలా ఫీలింగ్స్ ఎందుకు కలగడం లేదు? వేరే వాళ్లు ఎందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు?” అని తనని తాను నిందించుకుంటూ మానసిక క్షోభకు గురవుతుంటారు.
  3. నిరంతరం క్రాస్ చెక్ చేసుకోవడం- తమ జంట బాగుందా అని స్నేహితులను అడగడం, గూగుల్‌లో వెతకడం, ఇతరుల రిలేషన్‌షిప్‌తో పోల్చుకోవడం వంటివి చేస్తుంటారు.

కలిగే నష్టాలు..

ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. నిరంతరం ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల పని మీద ధ్యాస ఉండదు. అనవసరమైన అనుమానాల వల్ల భాగస్వామితో గొడవలు రావడం, చివరకు వారిని దూరం చేసుకోవడం జరుగుతుంది. “నేను నా భాగస్వామిని మోసం చేస్తున్నానేమో” అనే అపరాధ భావం వారిని వదలదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మందుల కంటే థెరపీ బాగా పనిచేస్తుంది.

  • ERP (Exposure and Response Prevention)- ఇందులో భయం కలిగించే ఆలోచనలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారు. ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి సమాధానం వెతకకుండా, ఆ ఆలోచనతోనే కాసేపు ఉండటం అలవాటు చేస్తారు.
  • CBT (Cognitive Behavioral Therapy)- ఇది ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ప్రేమ అంటే ఎప్పుడూ ఎగ్జైట్‌మెంట్‌ ఉండాలనే అపోహను తొలగిస్తుంది.

ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, అది ఒక నిర్ణయం. ఫీలింగ్స్ మారుతుండవచ్చు కానీ బంధం మీద గౌరవం ఉండాలి. ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అవన్నీ నిజం కావు అనే విషయాన్ని గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు మిమ్మల్ని వేధిస్తుంటే వెంటనే ఒక మంచి సైకాలజిస్ట్‌ను కలవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

Follow Us
ప్రేమ బంధాన్ని పదే పదే చెక్ చేస్తున్నారా?
ప్రేమ బంధాన్ని పదే పదే చెక్ చేస్తున్నారా?
హఠాత్తుగా క్లాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త స్టూడెంట్‌!ఏం చేసిందంటే
హఠాత్తుగా క్లాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త స్టూడెంట్‌!ఏం చేసిందంటే
ఒంటరితనం గుండెకు శాపం! నలుగురిలో ఉంటే హార్ట్‌ అటాక్ రాదా?
ఒంటరితనం గుండెకు శాపం! నలుగురిలో ఉంటే హార్ట్‌ అటాక్ రాదా?
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
పీఎం కిసాన్ నిధులు విడుదల.. అకౌంట్లోకి రూ.2 వేలు వచ్చేశాయి
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
నా తండ్రి మరణాన్ని ఇలా వాడుకుంటారా? డీమాన్ పవన్ ఆగ్రహం
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
గురక, ఆఫీస్ ఒత్తిడి.. నిద్ర కోసం దూరంగా ఉంటున్న జంటలు!
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
నీట్ యూజీ దరఖాస్తులో పొరపాటు చేశారా..? దిద్దుబాటుకు ఇక ఒక రోజే..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ఒకప్పుడు గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు టీమిండియా తోపు బౌలర్ భార్య..
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ముందు బంగారం పెరిగింది.. ఇప్పుడు గ్యాస్.. ప్రజలకు మరో బిగ్ షాక్?
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే
ఐపీఎల్ చరిత్రలో వికెట్ల సునామీ సృష్టించింది వీరే