AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping Dinner Side Effects: రాత్రి భోజనం మానేసారా ? అయితే మీ ఆరోగ్యానికి పెను ప్రమాదమే.. ఎందుకంటే..

కానీ రాత్రిపూట భోజనం మానేయడం వలన ఆరోగ్యానికి పెను ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఆకలితో నిద్రపోవడం వలన ఈ ఆరోగ్యమే కాకుండా మానసిక ఒత్తిడి

Skipping Dinner Side Effects: రాత్రి భోజనం మానేసారా ? అయితే మీ ఆరోగ్యానికి పెను ప్రమాదమే.. ఎందుకంటే..
Skipping Dinner
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2022 | 11:27 AM

Share

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గడం కోసం రాత్రిళ్లు భోజనం మానేస్తుంటారు. అలాగే మారుతున్న జీవనశైలి కారణంగా మధ్యాహ్నం ఆలస్యంగా భోజనం చేయడం వలన డిన్నర్ స్కిప్ చేస్తుంటారు. మరికొందరు నిద్రపోవడానికి డిన్నర్ చేయకుండా ముందు గ్లాసు పాలు తాగి పడుకుంటారు. కానీ రాత్రిపూట భోజనం మానేయడం వలన ఆరోగ్యానికి పెను ప్రమాదం అంటున్నారు నిపుణులు.. ఆకలితో నిద్రపోవడం వలన ఈ ఆరోగ్యమే కాకుండా మానసిక ఒత్తిడి పెరుగుతుంది.. ప్రతి రోజూ రాత్రిళ్ళు భోజనం మానేయడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల బరువు తగ్గుతుందని కొందరు అనుకుంటారు, అయితే ఇది నిజంగా సాధ్యమేనా? తెలుసుకుందాం…

మై హెల్త్ కథనం ప్రకారం.. రాత్రి భోజనం మానేయడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.. రాత్రి డిన్నర్ చేయకపోవడం వలన నిద్రభంగం కలుగుతుంది. ఒక వ్యక్తి రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే వారు తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.. అలాగే 8 నుంచి 9 గంటలు నిద్రించేవారు రాత్రిళ్లు భోజనం మానేయవచ్చు.. లేదా సాయంత్రం నీరు, ఎక్కువగా పండ్లను తీసుకోవచ్చు.. రాత్రిపూట మళ్లీ మళ్లీ తినకుండా ఉండడం వలన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట ఆహారం తీసుకోని అలవాటు ఉన్నవారు ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే ఆహారం తీసుకోకపోవడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతిరోజు రాత్రి భోజనం మానేసే వ్యక్తులు జంక్ ఫుడ్ లేదా రాత్రిపూట అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆందోళన స్థాయిలను పెంచుతుంది, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ మరింత ఉత్పత్తికి దారితీస్తుంది.

రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేయడం వలన నిద్రలేమికి గురవుతారు.. మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. డిప్రెషన్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.. నిదకు ఆటంకం కలుగుతుంది. నిద్రలేమి సమస్య తీవ్రంగా వేధిస్తుంది..

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులో అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)